ITR Filing on WhatsApp: మరో పది రోజుల్లో పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో చాలా మంది తమ రిటర్న్ సొంతంగా ఫైల్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. అయితే వారికి టెక్నాలజీ గురింతి పెద్దగా అవగాహన ఉండదు. అలాంటి వారికి ఇప్పుడు సులభంగా వాట్సాప్ ద్వారా తమ ఐటీఆర్ ఫైలింగ్ అందుబాటులోకి వచ్చేసింది.
దేశంలో ప్రస్తుతం రెండు కోట్ల మంది గిగ్ వర్కర్లు వివిధ రంగాల్లోని స్టార్టప్ కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు. వారు సులభంత తమ ఐటీఆర్ ఫైల్ చేసి తమ టీడీఎస్ తిరిగి పొందటానికి ఈ సర్వీస్ ప్రారంభించబడింది. అలాంటి వారి కోసం గతంలో కంటే సులువుగా పన్ను ఫైలింగ్ పూర్తి చేయించటం కోసం ClearTax సంస్థ కొత్తగా WhatsApp ద్వారా ITR ఫైల్ చేసేందుకు వీలుగా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ITR 1, ITR 4 ఫారమ్ అభ్యర్థులకు ఈ సేవ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ప్రజలు తమ ఐటీఆర్ ఫైల్ చేయటానికి ఆందోళన చెందుతున్నందున తాము ప్రవేశపెట్టిన ఈ సౌకర్యం వారి అవసరాలను తీర్చటంలో దేహదపడుతుందని ClearTax వ్యవస్థాపకుడు, సీఈవో అర్చిత్ గుప్తా చెప్పారు.

వాట్సాప్ ద్వారా ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్ ఇలా..
- ముందుగా ClearTax వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకుని దానికి Hi అని మెసేజ్ చేయాలి.
- తర్వాత అక్కడ మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి.
- దీని తర్వాత మీరు పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ వివరాలు మొదలైనవి అందించాలి.
- AI బాట్ సహాయంతో ITR-1 లేదా ITR-4 పూరించాలి. అయితే దీనిని పూరించిన తర్వాత అందించిన సమాచారం సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి.
- చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత టాక్స్ చెల్లింపుదారులు తమ వాట్సాప్‌లోనే సందేశాన్ని అందుకుంటారు.
వాట్సాప్ ద్వారా ఐటీఆర్ ఫైలింగ్ ప్రయోజనాలు..
- మీరు ITR-1 లేదా ITR-4 మధ్య ఏదైనా ఫారమ్‌ను సులభంగా ఫైల్ చేయవచ్చు.
- క్లియర్ టాక్స్ దేశంలోని దాదాపు 10 భాషల్లో సేవలను అందిస్తున్నందున భాషా పరమైన అవరోధాలను ఇది తొలగిస్తోంది.
- వాట్సాప్ ద్వారా పన్ను ఫైలింగ్, చెల్లింపు అత్యంత సులభతరం, సురక్షితం.
- సరైన పన్ను విధానాన్ని ఎంచుకోవడం ద్వారా పన్ను ఆదాకు ఇది దోహదపడుతుంది.


Click it and Unblock the Notifications