Stepup Mutual Funds: ఇటీవలి కాలంలో ప్రజల్లో ఫైనాన్షియల్ లిటరసీ క్రమంగా పెరుగుతోంది. లక్షల్లో జీతాలు పొందుతున్న యువత దానిని జాగ్రత్తగా మదుపుచేయటం గురించి కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తమ డబ్బును మంచి రాబడులను అందించే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈక్విటీలతో పాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి ప్రజాధరణను పొందుతున్నారు. ఈ మార్గంలో మార్కెట్లోకి ప్రతినెల వేల కోట్ల డబ్బు వచ్చి చేరుతోంది.
ఈ క్రమంలో చాలా మంది తమ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. ఇందుకోసం చాలా మంది నెలకు తక్కువ మెుత్తాల్లో సిప్ రూపంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీర్ఘకాలిక వ్యూహంతో నెలకు రూ.5000 చొప్పున ఈక్వీటీ ఫండ్స్ లో డబ్బు సిప్ చేయటం ద్వారా కోట్లు సంపాదించటానికి అవకాశాలు ఉన్నట్లు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఇక్కడ కేవలం మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకునేందుకు పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. మిగిలిన పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలను అనుభవం కలిగిన ఫండ్ మేనేజర్లు చూసుకుంటారు. వారు మార్కెట్లో ఉన్న అవకాశాలు, ప్రమాదాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులకు చెందిన డబ్బును వివిధ సంస్థలు, అసెట్లలోకి మారుస్తుంటారు. వీలైనంత తక్కువ రిస్క్ ఉండే విధంగా పెట్టుబడులను ప్లాన్ చేస్తుంటారు.

కేవలం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను కొనసాగిస్తే సరిపోదు. కోటీశ్వరులుగా మారాలంటే ప్రతి ఇన్వెస్టర్ ఈ చిన్న ట్రిక్ పాటించాల్సి ఉంటుంది. ఒక ఇన్వెస్టర్స్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా పెద్ద కార్పస్ అందుకోవాలంటే ఇది చాలా ముఖ్యం. సదరు వ్యక్తి నెలకు రూ.5,000 క్రమపద్దతిలో సిప్ పెట్టుబడిని చేపట్టినట్లయితే.. ప్రతి ఏటా స్టెప్ అప్ పద్ధతిలో తన పెట్టుబడి మెుత్తాన్ని 5 శాతం పెంచుకుంటూ వెళితే కోట్లలో మ్యూచువల్ ఫండ్ కార్పస్ జనరేట్ చేయవచ్చు. ఈ క్రమంలో 30 ఏళ్ల పాటు స్టెప్ అప్ చేస్తూ సగటున 12 శాతం రాబడిని ఆశించినట్లయితే చివరకి రూ.2.63 కోట్లు రాబడిని అందుకోవచ్చు. ఇదే క్రమంలో స్టెప్ అప్ కింద పెట్టుబడిని 10 శాతం పెంచితే చివరికి వారు ఏకంగా రూ.2.86 కోట్లను అందుకుంటారని వెల్లడైంది.
అలాగే ఇక్కడ రాబడి పెరిగే కొద్ది చివరికి ఇన్వెస్టర్లు పొందే రిటర్న్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా పెరుగుతూ పోతుంటుంది. స్టాక్ మార్కెట్లలో ఓలటాలికిటీ అనుగుణంగా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ అదారపడి ఉంటుంది. ప్రస్తుతం చాలా కాలంగా మార్కెట్లు బుల్ జోరును కొనసాగించటంతో పాటు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ షేర్లలో కొనసాగిన బూమ్ మంచి రాబడులను తెచ్చిపెట్టింది. ఇక్కడ ఇన్వెస్టర్లు వారి రిస్క్, రాబడి లక్ష్యాలకు అనుగుణంగా సరైన ఫండ్స్ ఏఎంసీల నుంచి తీసుకోవటం ఉత్తమం. ఈ క్రమంలో పెట్టుబడిదారులు ఫండ్ మేనేజర్ ఎవరు, స్కీమ్ పనితీరు, ఇతర స్కీమ్స్ తో పరిశీలించి చూడటం ఉత్తమం.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications