Mutual Funds: దేశీయంగా రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతున్న క్రమంలో స్టాక్ మార్కెట్లలోకి వారి సొమ్ము ప్రవహిస్తోంది. కొంత మంది ఇందుకోసం ట్రేడింగ్ మార్గంగా ఎంచుకుంటుండగా ఎక్కువ మంది మాత్రం మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ద్వారా డబ్బును పంప్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంచి రాబడులను అందించే వివిధ స్కీమ్స్ కోసం చాలా మంది సెర్చ్ చేస్తున్నారు.
గడచిన రెండేళ్ల కాలంగా అనేక ప్రభుత్వ రంగ స్టాక్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్‌లు బలమైన పనితీరును కనబరుస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారుల కోసం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీల్‌లో PSUలు, ఇన్‌ఫ్రా మ్యూచువల్ ఫండ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి PSU అండ్ ఇన్‌ఫ్రా మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫండ్ హౌస్ నుంచి అందుబాటులో ఉన్న ELSS ఫండ్ కూడా గత మూడు సంవత్సరాలుగా మంచి రాబడులను అందిస్తోంది.

వార్షిక SIP రిటర్న్‌ల పరంగా థీమాటిక్ మ్యూచువల్ ఫండ్ మూడు ఏళ్లలో అన్ని SIP మ్యూచువల్ ఫండ్‌లను అధిగమించింది. ఈ ఫండ్ మూడేళ్లలో 58.25 శాతం SIP రాబడిని కలిగి ఉంది. కాబట్టి ఈ కాలంలో ఫండ్‌పై మొత్తం రాబడి 42.74 శాతంగా నమోదైంది. జనవరి 2013లో ప్రారంభమైనప్పటి నుంచి ఫండ్ 13.76 శాతం వార్షిక రాబడిని ఆర్జించింది. ఫండ్ ఎస్బీఐ, గెయిల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ సహా 26 కంపెనీల షేర్లను కలిగి ఉంది. నెలవారీ ఎస్ఐపీ రూపంలో రూ.27,500 సిప్ చేసిన పెట్టుబడిదారులు మూడేళ్ల కాలంలో రూ.21.65 లక్షల రాబడిని అందుకుంటారు.
SBI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మూడేళ్ల కాలంలో 43.90 శాతం వార్షిక SIP రాబడిని అందించింది. ఆ కాలంలో పథకంపై మొత్తం రాబడి 33.25 శాతంగా ఉంది. ఈ స్కీమ్ నెలవారీ పెట్టుబడి మొత్తం మూడేళ్లలో రూ.18.18 లక్షల రాబడిని ఇచ్చింది. SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అనేది SBI మ్యూచువల్ హౌస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్(ELSS) స్కీమ్. మూడేళ్ల వ్యవధిలో ఫండ్ 40.23 శాతం వార్షిక SIP రాబడిని పెట్టుబడిదారులకు అందించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications