Mudra Loan: ప్రస్తుత కాలంలో సమాజంలో ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నవారితో సమానంగానే వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కొందరు ఏకంగా లక్షలు జీతాలు ఇస్తున్న ఉద్యోగాలను మానేసి సాంకేతికతను తమ సృజనాత్మకమైన వ్యాపార ఆలోచనలకు జోడిస్తున్నారు. ఇలా వ్యాపారవేత్త అవ్వాలనే తమ మక్కువను విజయతీరాలకు చేరుస్తున్నారు.
అయితే కొందరికి వారి జీవితాలోచనలను ఆచరణ రూపంలో వ్యాపారంగా మలిచేందుకు ఆర్థికంగా స్థోమత ఉండదు. అలాంటి వారికోసమే ప్రధాన మంత్రి ముద్ర యోజన తీసుకురాబడింది. ఇటీవలి కాలంలో దీని రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచబడింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్కీమ్ కింద అందిస్తున్న రుణ పరిమితిని డబుల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది అమలులోకి వచ్చింది. ముద్ర యోజన స్కీమ్ కింద కొత్తగా తరుణ్ ప్లస్ కేటగిరీ రూపొందించబడినట్లు ఆర్థిక సేవల విభాగం అక్టోబర్ 24, 2024న వెల్లడించింది. ఇప్పుడు భారీ మెుత్తంలో రుణాన్ని పొందటానికి అర్హులైన ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవకాశం కల్పించబడుతోంది.

కొత్తగా తీసుకొస్తున్న కేటగిరీ కింద, గతంలో తరుణ్ కేటగిరీ రుణాన్ని పూర్తిగా చెల్లించిన పారిశ్రామికవేత్తలకు రూ.20 లక్షల వరకు రుణాలు అందించబడతాయి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు స్కీమ్ ద్వారా భారీగా ప్రయోజనం పొందనున్నారని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ముద్ర లోన్ కింద శిశు కేటగిరీలో రూ.50 వేల వరకు రుణం అందించబడుతోంది. ఇదే సమయంలో కిషోర్ కేటగిరీలో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం మంజూరు చేయబడుతుంది. అలాగే తరుణ్ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ ఆఫర్ చేయబడుతోంది. అయితే తాజాగా తీసుకొస్తున్న తరుణ్ ప్లస్ రూ.20 లక్షల వరకు రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.2,20,662.40 కోట్ల విలువైన మొత్తం 22937661 రుణాలు ముద్ర యోజన కింద ఆమోదించబడ్డాయి. వీటిలో రూ.2,14,364.71 కోట్ల రుణం అందించబడింది. అయితే మీరు బ్యాంకును లోన్ కోసం సందర్శించినప్పుడు మంజూరుకు నిరాకరిస్తే దానిపై ఫిర్యాదు చేసేందుకు సైతం అవకాశం ఉంది.
రుణం మంజూరు విముఖతపై పోస్ట్/మెయిల్/ఈమెయిల్/బాక్స్ ద్వారా ఫిర్యాదులు:
కస్టమర్‌లు తమ ఫిర్యాదులను కింది చిరునామాలో పోస్ట్ ద్వారా లేదా [email protected]లో ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం పూర్తి వివరాలు, విముకతపై వివరాలను తెలియజేస్తూ కంప్లెయింట్ చేయవచ్చు. ఇదే విషయం గురించి ఆర్బీఐకి ఆన్‌లైన్‌లో RBI CMS పోర్టల్ https://cms.rbi.org.inలో ఫైల్ చేయవచ్చు.
కస్టమర్ సర్వీస్ సెల్:
మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్
స్వావలంబన్ భవన్, మొదటి అంతస్తు, C-11, G-బ్లాక్,
బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (E), ముంబై- 400 051
టెలిఫోన్: 022 6722 1465.
ఆర్బీఐకి ఫిర్యాదు:
సెంట్రల్ రిసీట్స్ అండ్ ప్రాసెసింగ్ కేంద్రం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4వ అంతస్తు,
సెక్టార్ 17, చండీగఢ్- 160017
RBI సంప్రదింపు కేంద్రం టోల్-ఫ్రీ నంబర్- 14448
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications