2025లో సంపన్నుడిగా మారాలంటే ఈ సీక్రెట్స్ తప్పక తెలుసుకోండి..!!

2025 Tips to Rich: ధనవంతులు కావాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే కొందరు తమ జీవితాలను సులభంగా, సాఫీగా మారితే చాలని భావిస్తుంటారు. డబ్బు భారీగా సంపాదించలేకపోయినప్పటికీ వచ్చే ఆదాయాన్ని సరిగా మేనేజ్ చేస్తే ఖచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. 2025లో కూడా ధనవంతులు కావడానికి ఆర్థిక నిపుణుల చిట్కాలను సిఫార్సు చేస్తున్నారు. వీటిని ఫాలో అయిన వ్యక్తులు ఖచ్చితంగా ధనవంతులుగా మారటం అంత కష్టమేమీ కాదు.

బడ్జెట్ ప్లానింగ్: బడ్జెట్‌ను సరిగ్గా ప్లాన్ చేయడానికి ఆర్థిక నిపుణులు 50-30-20 నియమాన్ని పాటించాలి. ఆదాయంలో 50 శాతం నిత్యావసరాల కోసం, 30 శాతం ఇష్టమైన వాటిపై ఖర్చుల కోసం, మిగిలిన 20 శాతం పొదుపు చేయటం ఉత్తమం. అలాగే అనవసరపు ఖర్చులను తగ్గించుకోవటం వల్ల సేవింగ్స్ భారీగా పెరుగుతాయి.

Know how one can become rich in 2025 by following few healthy financial habits

పెట్టుబడులు పెట్టడం: తక్కువ రిస్క్ ఉన్న వాటిలో పెట్టుబడి పెట్టండి. డెట్ ఫండ్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, NPS మొదలైనవాటిని ఎంచుకుంటే, స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. పెట్టుబడి విలువ పెరుగుతుందో లేదో మీరు నిరంతరం తనిఖీ చేయాలి. ఆశించిన రాబడులు రాకపోతే వ్యూహం మార్చుకోవాలి. ఇదే క్రమంలో మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు వంటి అధిక ఆదాయం అందించే పెట్టుబడి సాధనాలపై కూడా పెట్టుబడులను కలిగి ఉండటం మంచిది.

ఎమర్జెన్సీ ఫండ్: మీరు ఎల్లప్పుడూ అత్యవసర నిధిని కలిగి ఉండటం తప్పనిసరి. దీనివల్ల అనుకోని పరిస్థితుల వల్ల ఆదాయం లేకపోయినా 6 నెలల నుంచి ఏడాది వరకు హాయిగా జీవించవచ్చు. ఈ నిధిని తప్పకుండా బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో నిల్వ ఉంచుకోవటం మంచిది.

ఫైనాన్షియల్ ప్లానింగ్: తక్కువ వ్యవధిలో అధిక రాబడిని పొందాలనే ఆశతో అధిక రిస్క్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఇలాంటి సందర్భాల్లో లాభం లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే మీరు పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి పన్ను సలహాదారుని సంప్రదించాలి మరియు తద్వారా మినహాయింపులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

రుణాల నిర్వహణ: మీకు అప్పులు ఉంటే, ముందుగా అత్యధిక వడ్డీ భారం ఉన్న వాటిని సెటిల్ చేయడానికి ప్రయత్నించండి. క్రెడిట్ కార్డ్ చెల్లింపులను పెనాల్టీ లేకుండా సకాలంలో చెల్లించండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రుణం తీసుకోండి. అలాగే కొత్త ఏడాదిలో తప్పనిసరిగా ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ ప్లానింగ్ తప్పనిసరి. కుటుంబ భద్రకోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం ముఖ్యం. రుణాలను తీసుకున్న వ్యక్తులకు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. వారి ఫ్యామిలీకి ఇది పెద్ద భద్రతను అందిస్తుంది. అలాగే విలాసవంతమైన జీవితం కోసం అవసరంగా డబ్బు ఖర్చు చేయటాన్ని ప్రజలు కొత్త ఏడాది మార్చుకోవాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+