Mutual Fund SIP: 2024లో అన్నింటి కంటే ఎక్కువగా పాపులర్ అయ్యినవి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు. దీంతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనే పదం చాలా మందికి పరిచయం అయ్యింది. దీనికి తోడు కరోనా తర్వాత ప్రజలల్లో ఆర్థిక అంశాలపై ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పెరగటంతో వారికి అనుకూలంగా ఉండే వివిధ పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు.
ఈ ఏడాది మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించాయి. SIP ద్వారా పెట్టుబడిదారులు తమ డబ్బుకు మంచి రాబడిని పొందడమే కాకుండా, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కూడా రికార్డు స్థాయిలో పెట్టుబడిదారులను చూసింది. భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను ఆకర్షిస్తోంది. పెట్టుబడిదారులు తమ ఆదాయానికి అనుగుణంగా ప్రతి నెలా క్రమం తప్పకుండా చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టారు. దీని ద్వారా దీర్ఘకాలంలో భారీ లాభాలను పొందాలని సాధారణ పెట్టుబడిదారులు భావిస్తున్నారు.

మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోని అనేక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కనీస పెట్టుబడి మెుత్తాన్ని రూ.1000 నుంచి రూ.100కి తగ్గించిన సంగతి తెలిసిందే. ఇది మరింత మంది ఇన్వెస్టర్లను క్రమంగా ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 2024లో రికార్డు స్థాయిలో రూ.16,000 కోట్ల కంటే ఎక్కువ నెలవారీ SIP కలెక్షన్‌లను చూసింది. ఇక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు అమాంతం పెరిగిపోయాయి. గడచిన నెలలో స్టాక్ మార్కెట్లు క్షీణతను చూసిన వేళ చాలా మందీ తెలివైన పెట్టుబడిదారులు తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను బై ఎట్ డిప్స్ స్టాటజీని ఉపయోగించి కొనుగోలు చేశారు.
ప్రధానంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు చారిత్రాత్మక ర్యాలీతో గరిష్ఠాలకు చేరిన సంగతి తెలిసిందే. అలాగే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ విభాగంలోని కంపెనీల షేర్లు అద్భుత పనితీరును కనబరచటంతో ఆ కేటగిరీలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ ఆశ్చర్యకరమైన రాబడులతో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ఈ క్రమంలో మిడ్-క్యాప్ ఫండ్ సంవత్సరానికి దాదాపు 25-30% రాబడిని అందించగా, స్మాల్-క్యాప్ ఫండ్స్ 35% కంటే ఎక్కువ రాబడిని తెచ్చిపెట్టాయి. కానీ ఇప్పుడు మార్కెట్లు కరెక్షన్ మోడ్ లో ఉన్నందున పెట్టుబడిదారులు బ్లూ చిప్ ఫండ్స్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలో మంచి రాబడులను అందించిన ఫండ్స్ వివరాలను పరిశీలిస్తే.. హెచ్‌డిఎఫ్‌సి ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్ ఒక సంవత్సరం సిప్‌పై 54.12 శాతం రాబడిని ఇచ్చింది. ICICI ప్రుడెన్షియల్ PSU ఈక్విటీ ఫండ్ రెండేళ్ల SIPపై 44.25% వార్షిక రాబడిని ఇచ్చింది. HDFC డిఫెన్స్ ఫండ్ ఒక సంవత్సరం SIP పై 70% రాబడిని ఇచ్చింది. అలాగే ఒకేసారి పెట్టుబడి పెట్టిన వారు ఒక సంవత్సరంలో 82.43% మరియు ప్రారంభించినప్పటి నుండి సంవత్సరానికి 80.24% రాబడిని పొందారు. SBI నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ 3-సంవత్సరాల SIPపై 29.13% వార్షిక రాబడిని తెచ్చిపెట్టింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications