Petrol Bunk: ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సైతం గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెరుగుతోంది. ఈ క్రమంలో చాలా మంది ఇటీవలి కాలంలో ఈవీలకు నెమ్మదిగా మారటం మానేశారు. దీనికి బదులుగా ఎక్కువ మంది హైబ్రిడ్ వాహనాలను కొంటున్నట్లు తేలింది. వాస్తవానికి ఈవీలకు ఉన్న పరిమితుల కారణంగా ఇప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సాంప్రదాయిక ఇంధనాలతో నడిచే కార్లు, స్కూటర్లకు ప్రజలు దూరం కావటం లేదు. కావాలంటే ఈవీని అదనంగా కొనుక్కుంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికీ పెట్రోల్ బంకులకు తాకిడి ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం రెగ్యులర్ కార్పొరేట్ రొటీన్ నుంచి దూరంగా సొంత వ్యాపారం ప్రారంభించాలని చూలా మంది చూస్తున్నారు. అధిక వర్క్ ప్రెజర్ ఇష్టం లేక సొంతంగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న కొందరిలో పెట్రోల్ బంకును తెరవాలనే ఆలోచన బలంగా ఉంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలో పెట్రోల్ పంపును తెరవడానికి దరఖాస్తుదారు కనీసం 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అలాగే కనీస విద్యార్హత 10వ తరగతిగా నిర్ణయించబడింది. సదరు అభ్యర్థికి రిటైల్ అవుట్‌లెట్ లేదా మరేదైనా రంగంలో కనీసం 3 ఏళ్ల పాటు అనుభవం ఉండాలి. పెట్రోల్ బంకును ఏర్పాటు చేయాలనుకునే దరఖాస్తుదారు కనీసం రూ.25 లక్షల నికర విలువ కలిగి ఉండాలి. కుటుంబ నికర విలువ రూ.50 లక్షల కంటే ఎక్కువగా ఉండాలని చమరు కంపెనీలు నిర్ణయించాయి. దీనికోసం దేశంలోని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, రిలయన్స్, ఎస్సార్ వంటి సంస్థల నుంచి బంకు ఏర్పాటుకు లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.
ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ పంప్ యూనిట్‌కు 800 చదరపు మీటర్ల స్థలం అవసరం కాగా, 2 యూనిట్లకు 1200 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి. ఇక పట్టణ ప్రాంతాల్లో బంక్ ఏర్పాటుకు ఒక యూనిట్ కోసం 500 చదరపు మీటర్ల స్థలం అవసరం. ఇదే క్రమంలో 2 యూనిట్ల ఏర్పాటుకు 800 చదరపు మీటర్ల స్థలం అవసరం కావచ్చు. ఇక జాతీయ రహదారి వెంబడ పెట్రోల్ పంప్ ఏర్పాటుకు కొద్దిగా స్థలం ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక యూనిట్ కోసం 1200 చదరపు మీటర్లు, 2 యూనిట్ల కోసం 2000 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరిగా నిర్థేశించబడింది.
పెట్రోల్ బంకు తెరవడానికి పెట్టుబడి:
ప్రస్తుతం మార్కెట్లో భూమి విలువలు భారీగానే కొనసాగుతున్నాయి. సొంతంగా స్థలం లేని వ్యక్తులు దీనికోసం రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో పెట్రోల్ పంపుకు రూ.1.50 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇందులో అవసరమైన పరికరాలు, ఇతర ఇన్ ఫ్రా ఏర్పాటు ఉంటుంది. ప్రభుత్వ అధికారుల నుంచి అవసరమైన అనుమతులను పొందడానికి లైసెన్స్ ఫీజులు రూ.2-5 లక్షల వరకు ఎక్కడైనా ఖర్చవుతాయి. పెట్రోలియం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో "రిజిస్టర్ నౌ" ఎంపికపై క్లిక్ చేసి దరఖాస్తును పూరించవచ్చు. ఇక్కడ కనీస రుసుము రూ.100 నుంచి రూ.1000 వివిధ కేటరిగీ దరఖాస్తుదారులకు వేరుగా ఉంటుంది.
పెట్రోల్ పంపు ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఎంత సంపాదించవచ్చనే వివరాలు మాత్రం సదరు పంప్ ఆపరేట్ చేస్తున్న ప్రాంతంలో ఉండే రద్దీ, ఇంధన డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ ప్రాంతంలో ప్రజలు ఈవీలను ఎంత విరివిగా ఉపయోగిస్తున్నారనేదానిపై కూడా డిమాండ్ ఆదారపడి ఉంటుంది. పెరుగుతున్న ఇంధన ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే చాలా మంది ఈవీలను సిటీ కమ్యూటింగ్ కోసం వినియోగిస్తున్నారు. కాబట్టి ఏ ఏరియాలో పంప్ ఏర్పాటు చేస్తున్నారనే విషయం ఆదాయంపై కీలక ప్రభావాన్ని చూపుతుందని దరఖాస్తుదారులు గమనించాల్సి ఉంటుంది. అందువల్ల ఇలాంటి పెట్టుబడి పెట్టటానికి ముందు సరైన సర్వే నిర్వహించి ఆర్థిక సలహాదారుల సూచనల మేరకు ప్రాజెక్టు వయబిలిటీ విషయంలో ముందుకు సాగటం చాలా కీలకం. భారీ బడ్జెట్ పెట్రోల్ పంప్ ఏర్పాటుకు అవసరం ఉన్నందున ఇతరుల సూచనల కంటే సొంతంగా ఆలోచించటం కీలకం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications