Gold News: ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు..? పన్ను చట్టాల నిబంధనలు ఇవే..

Gold News: ఇండియాలో ఎక్కువ మందికి బంగారం అంటే అమితమైన ప్రేమ ఉంది. దీంతో ఉన్న డబ్బులు మెుత్తం కూడబెట్టి పసిడి కొంటుంటారు. ఎక్కువ బంగారం ఉండాన్ని గౌరవంగాను, శుభప్రదమైనగా వారు భావిస్తుంటారు.

అయితే ఈ విశ్వాలను పక్కన పెడితే.. అసలు చట్టప్రకారం దేశంలో ఏ వ్యక్తి అయినా ఎంత బంగారాన్ని కలిగి ఉండవచ్చు అనే అనుమానం సహజంగానే ఎక్కువ మందికి ఉంటుంది. ఇంట్లో ఎన్ని గ్రాముల వరకు బంగారం ఉండొచ్చు. వాటికి లెక్కలు చెప్పాలా..? బహుమతిగా వచ్చిందాన్ని ఏం చేయాలి వంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాదానం తెలుసుకుందాం.

Know how much gold one can have under income tax laws and tax implications too

బంగారం పరిమితులపై దేశంలోని ఆదాయపు పన్ను చట్టం కొన్ని కీలక నిబంధనలను రూపొందించింది. వీటి ప్రకారం వివాహిత మహిళలు 500 గ్రాములు, అవివాహిత మహిళలు 250 గ్రాముల వరకు పసిడిని కలిగి ఉండొచ్చు. ఇక మగవారి విషయానికి వస్తే పెళ్లి కాని పురుషులకు 100 గ్రాములు, పెళ్లి అయిన పురుషులు కూడా 100 గ్రాముల వరకు బంగారాన్ని కలిగి ఉండొచ్చని పేర్కొంది. ఈ పరిమితుల వరకు ఉన్న పసిడికి సంబంధించిన లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వేళ వీటికి మించి మీ దగ్గర బంగారం ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వివరాలను అధఇకారులతో పంచుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే వాటి ఆదాయ మార్గాలను చెప్పాల్సి ఉంటుంది.

బంగారాన్ని కొనుగోలు చేసిన మూడేళ్లలోపు అమ్మితే దానిపై వచ్చిన లాభాలపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లెక్కిచబడతాయి. ఆ తర్వాత అమ్మితే వాటిపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ఉంటుందని ఆదాయపు పన్ను చట్టం చెబుతోంద. పైగా దీనిపై 4 శాతం సెస్ కూడా ఉంటుంది. దీనికి తోడు ప్రస్తుతం చాలా మంది భౌతికంగా బంగారాన్ని కొనటం కంటే డిజిటల్ గోల్డ్, గోల్డ్ బాండ్స్ వైపు ఎక్కువగా మెుగ్గుచూపుతున్నారు. సావరిన్ గోల్డ్ బాండ్స్ పెట్టుబడిదారులకు క్యాపిటల్ అప్రీసియేషన్‌తో పాటుగా వడ్డీ ఆదాయం కూడా లభించటం మంచి ఆకర్షనీయంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+