Lucky Bhaskar: స్టాక్ మార్కెట్లను ముంచేసిన లక్కీ భాస్కర్ హర్షద్ మెహతా.. అసలు ఏంటి బ్యాంక్ బీఆక్ ఫ్రాడ్?

Harshad Mehta: స్టాక్ మార్కెట్లలోకి చాలా మంది ఇన్వెస్టర్లు పెద్ద కలలతో అడుగుపెడుతుంటారు. రూపాయి పెట్టి దానిని పది రూపాయలుగా మార్చుకోవాలని తహతహలాడుతుంటారు. అయితే ఇదంతా మధ్యతరగతి ప్రజల ఆలోచన. అయితే వీరికి తెలియని విషయం ఏమిటంటే ఈ వ్యవస్థలను చాలా పెద్ద ఇన్వెస్టర్లు వెనకనుంచి శాశిస్తుంటారన్నదే. ఈవిషయం బట్టబయలైంది హర్షద్ మెహతా స్కామ్ బయటపడిన తర్వాతే.

కరెక్టుగా కొంతకాలం వెనక్కి వెళితే 1980-1990లలో దేశీయ స్టాక్ మార్కెట్లను పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకున్న వ్యక్తి హర్షద్ మెహతా. తొలినాళ్లలో బతుకుతెరువు కోసం ముంబైవచ్చిన ఈ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి స్టాక్ బ్రోకర్ వద్ద పనిచేసే స్టాయి నుంచి స్టాక్ మార్కెట్లను ఏకంగా శాసింటే స్థాయికి ఎదిగిపోయాడు. దీనిలోని కాధాంశాన్నే ఇటీవల దీపావళికి రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ సినిమా పేరుతో తెలుగులో విడుదలైంది. భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ఆ నాటి ముంబై వీధుల నుంచి స్టాక్ మార్కెట్ల వరకు అన్నింటినీ ప్రజలకు తిరిగి గుర్తుచేసింది. ఆరోజుల్లో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లలో చేసిన కుంభకోణం గురించి ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది.

Know How Lucky Bhaskar Movie revealed Harshad Mehata used bank funds wrongly for trading

ఇక్కడ దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ పాత్రలో ఒదిగిపోయారు. చిన్న బ్యాంక్ ఉద్యోగి స్థాయిలో ఉన్న వ్యక్తి హర్షద్ మెహతా లాంటి మోసగాడితో ఎలా కలవాల్సి వచ్చింది. ఎందుకు చేతులు కలిపారు, దీని వెనుక బ్యాంకులు చేసిన పెద్ద మెసాలు వంటి విషయాలను సినిమాలో చక్కగా చూపించారు. కథ హర్షద్ మెహతాకు కనెక్ట్ అయ్యింది భాస్కర్ అసిస్టెంట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే. బ్యాంక్ గ్యారెంటీలు జారీ చేయాలని బ్యాంక్ మేనేజ్‌మెంట్ హర్షద్ మెహతా పంపించే బ్యాంక్ గ్యారెంటీలపై సంతకాలు చేయటం, పేమెంట్స్ లేటైనా వాటిని రికార్డుల్లో సర్థుబాటు చేయటం వంటివి చేసేవాడు. పైగా ఇదే సమయంలో మెహతా చేసే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సీక్రెట్స్ ద్వారా ఆదాయం పొందటంతో పాటు గ్యారెంటీలను జారీ చేస్తున్నందుకు వాటాలను ఇతర అక్రమ మార్గాల్లో ఎలా వైట్ మనీగా ముంబైలో మార్చేవారో దుల్కర్ సల్మాన్ పాత్ర సినిమాలో చూపించింది.

ఒక స్థాయిలో హర్షత్ మెహతా కోసం బ్యాంకింగ్ సంస్థలు ఏ స్థాయిలో కుమ్మక్కై పనిచేసేవో సినిమాలో చూపించారు. ఏకంగా బ్యాంకు పుస్తకాల్లో తప్పుడు బ్యాంక్ గ్యారెంటీల ద్వారా రూ.100 కోట్లు ప్రజల డబ్బు మాయం కావటంపై ఆదాయపు పన్ను అధికారులు, రిజర్వు బ్యాంకుకు అందిన సమాచారంతో అసలు విషయాలు సినిమాలో బయటపడ్డాయి. వాస్తవానికి ఇటీవలి కాలంలో బిగ్ బుల్ అనే పదాన్ని మనం విన్నప్పటికీ 1980లలో ఈ పేరు హర్షద్ మెహతాది. సుచీతా దలాల్ అనే జర్నలిస్ట్ బయటపెట్టిన నిజాలతో 1992లో అప్పట్లో హర్షద్ మెహతా స్కామ్ కి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వాస్తవానికి హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్‌లో భారీగా అవసరమైన పెట్టుబడి సొమ్ముకోసం బ్యాంకుల నుంచి డబ్బును పక్కకు మళ్లించిన తీరును లక్కీ భాస్కర్ సినిమా చూపించింది. హర్షద్ మెహతా సమయంలో విజయవాడ నుంచి విశాఖ వరకు అన్ని చోట్లా వ్యాపారులు ఈజీ మనీ కోసం వ్యాపారాలను పక్కన పెట్టి స్టాక్ మార్కెట్లలో వివిధ కంపెనీల షేర్లను కొనుగోలు చేసిన సంగతి ఇప్పటికీ చాలా మంది గుర్తుచేసుకుంటున్నారు. ఆ సమయంలో మెహతా స్కామ్ బయటకు రావటంతో లక్షల నుంచి కోట్ల వరకు పోగొట్టుకున్న చాలా మంది ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. దీంతో లక్షలాది మంది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయి షాక్‌కు గురయ్యారు.

అప్పట్లో ఈ కుంభకోణంలో రూ.4,000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు తేలింది. స్టాక్ మార్కెట్ల చరిత్రలో జరిగిన ఈ అతిపెద్ద మోసం సెబీ కొత్త నిబంధనలకు దారితీసింది. ఈ కేసులో జైలుకెళ్లిన మెహతా తర్వాతి కాలంలో గుండెపోటుతో జైలులోనే మరణించారు. ఈ క్రమంలో దాదాపు 9 ఏళ్లు శిక్షను అనుభవించారు. ఆ తర్వాత అదని సోదరుడు బీఎల్ పూర్తి చేసి తమకేసులను తానే వాదించుకున్నట్లు కూడా వెల్లడైంది. లక్కీ భాస్కర్ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థను హర్షద్ మెహతా ఎలా దుర్వినియోగం చేశాడనే విషయం చూపించబడింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+