Investment News: అమెరికాలో సబ్‌ప్రైమ్ లెండింగ్ సంక్షోభం దాదాపు 16 ఏళ్ల కిందట జరిగింది. అది 2008లో ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. ఆ సమయంలో అమెరికాకు చెందిన లెమాన్ బ్రదర్స్ బ్యాంక్ పతనమైంది. అప్పట్లో సేఫ్ హెవెన్ బంగారం ధరలతో పాటు ఇతర విలువైన లోహాల ధరలు పెరిగాయి. దీని తర్వాత ఇన్వెస్టర్లు రూ.100ను ఈక్విటీ లేదా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే రాబడి ఎలా ఉండేదో ఇప్పుడు పరిశీలిద్దాం.
బంగారం, ఈక్విటీలు ఇన్వెస్టర్ల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో విభిన్నమైన కానీ పరిపూరకరమైన ప్రయోజనాలను అందిస్తాయని SS వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్‌దేవా అన్నారు. ఈక్విటీ పెట్టుబడిదారులను దేశ ఆర్థికాభివృద్ధిలో పాలుపంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇది ఎక్కువ రాబడిని అందుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. కాలక్రమేణా పెట్టుబడిదారుల సంపదను పెంచుతుంది. అయితే మరోపక్క బంగారం ప్రజల కొనుగోలు శక్తిని సంరక్షించటంలో సహయపడుతుంది. దశాబ్దాలుగా ప్రజలు సంక్షోభ సమయాల్లో బంగారాన్ని విలువ నిల్వ చేసేందుకు ప్రసిద్ధి చెందింది. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా రెండింటిలోనూ ప్రజలు తమ పెట్టుబడులను పెట్టవచ్చు.

నిఫ్టీ ఇండెక్స్ 2008 సంక్షోభం తర్వాత వచ్చిన రాబడితో బంగారం ధరల్లో మార్పులకు భిన్నంగా 2007 నుంచి 2024 వరకు విశ్లేషించబడుతుంది. ఇది నిఫ్టీ 50, గోల్డ్ మధ్య డైనమిక్స్‌ను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ క్రమంలో నిఫ్టీ, గోల్డ్ రెండూ 2008 ప్రారంభం తర్వాత బలమైన సంపూర్ణ రాబడులను అందించాయి. ఏదేమైనప్పటికీ బంగారం నిఫ్టీని దాదాపు 590.29% సంపూర్ణ రాబడితో అధిగమించింది. దీనికి గడచిన ముడు నెలలుగా బంగారం ధరల్లో వచ్చిన అనూహ్య పెరుగుదల ప్రధాన కారణంగా ఉంది. అయితే సబ్-ప్రైమ్ సంక్షోభం చెలరేగినప్పటి నుంచి నిఫ్టీ-50 సూచీ 299.62% వృద్ధిని ఇన్వెస్టర్లకు అందించింది.
ఎవరైనా పెట్టుబడిదారుడు తన డబ్బును 2008 సంక్షోభం తర్వాత రూ.100 బంగారంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువ ప్రస్తుతం రూ.690.29కి చేరుకుంది. అలాగే రూ.100ను అప్పట్లో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సూచీ నిఫ్టీ 50లో పెట్టుబడిగా పెట్టి ఉంటే దాని విలువ ప్రస్తుతం రూ.399.62కి చేరుకుంది. ఒకవిధంగా చూస్తే బంగారం స్టాక్ మార్కెట్లలో పెట్టుబడికి డబుల్ రాబడిని ఇదే కాలంలో పెట్టుబడిదారులకు అందించింది.
అసలు గోల్డ్ ఎందుకింత భారీగా పెరిగింది?
2008 సంక్షోభం తర్వాత ఏర్పడిన అనేక కారకాలు ప్రస్తుతం గోల్డ్ ధరల పెరుగుదలకు అత్యధిక రాబడులకు కారణంగా నిలిచాయి. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల భారీ లిక్విడిటీ ఇన్ఫ్యూషన్, తక్కువ వడ్డీ రేటు విధానం, ప్రధాన సెంట్రల్ బ్యాంక్‌ల బంగారం కొనుగోళ్లు, వాణిజ్య ఉద్రిక్తతలు, భారత రూపాయి క్షీణత వంటి అంశాలు బంగారపు ఊపందుకోవడానికి దోహదం చేశాయి. 2008లో డాలర్‌తో రూపాయి మారకం విలువ దాదాపు 39.38 వద్ద ట్రేడవుతుండగా ప్రస్తుతం అది రికార్డు స్థాయిలో 83.71 మార్కులకు పడిపోయింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications