Year Ender 2023: ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థలను కకావికలం చేసిన ద్రవ్యోల్బణం..!!
Inflation 2023: కేవలం భారత ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ద్రవ్యోల్బణం కుదిపేసింది. ప్రజలు సైతం పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణ భారాన్ని మోశారు.
అక్టోబర్‌లో నాలుగు నెలల కనిష్ట స్థాయి అయిన 4.8 శాతానికి పడిపోయింది. అయితే నవంబర్‌లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం పుంజుకుని 5.55 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఈ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 8.70 శాతంగా నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం నవంబరులో పెరుగుదలకు యంత్రాలు, ఖనిజాలు, ఆహార వస్తువులతో పాటు ఇతర రంగాలు దోహదపడినట్లు ఇటీవల వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది.

రిటైల్ ద్రవ్యోల్బణం కాకుండా ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 2.53 శాతం నుంచి నవంబర్‌లో 8.18 శాతానికి పెరిగింది. అంతేకాకుండా ఉల్లిపాయల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 101.24 శాతానికి పెరిగింది. వరి, పండ్ల ద్రవ్యోల్బణం వరుసగా 10.44 శాతం, 8.37 శాతంగా ఉంది. నవంబర్‌లో బంగాళదుంపల ద్రవ్యోల్బణం(-)27.22 శాతం వద్ద తక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో రిటైల్ ఆహార ధరల కంటే హోల్‌సేల్ ఆహార ధరలలో పెరుగుదల ఎక్కువగా ఉందని బార్క్లేస్ పేర్కొంది.
దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం ప్రజల జీవన వ్యయాన్ని ప్రభావితం చేసింది. దీని కారణంగా తరచుగా వస్తువులు, సేవల ధరలు పెరుగుదల నమోదైంది. తద్వారా ప్రజలు, కుటుంబాల జీనవ వ్యయాలు అనూహ్యంగా పెరుగుతుంది. అలాగే వారి కొనుగోలు స్థోమత తగ్గుతుంది. పెరుగుతున్న ఇంధన ధరలు నేరుగా వస్తువులు, సేవల ధరలను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణానికి దోహదం చేస్తాయి. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా వేతనాలు పెరగకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications