Market Next Week: ఈవారం ఇన్వెస్టర్లు ధనవంతులవుతారా? నిపుణులు ఏమంటున్నారంటే?
Stock Market: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కొంత ఒడిదొడుకులను చూసినప్పటికీ మెుత్తానికి పెట్టుబడిదారులకు లాభాలను అందించాయి. ప్రధానంగా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై పావెల్ కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు ఊరటను అందించాయి. ఈ క్రమంలో రానున్న వారంలో మార్కెట్ల పరిస్థితి ఎలా ఉండనుందనే ఆందోళనలు కొనసాగుతున్నాయి.
గ్లోబల్ ట్రెండ్, స్థూల ఆర్థిక డేటా ప్రకటన, విదేశీ పెట్టుబడిదారుల కార్యకలాపాలు ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్లను ముందుకు నడిపించే అంశాల్లో కీలకంగా ఉన్నాయి. వీటికి అదనంగా చమురు ధరలు, యూఎస్ డాలర్ రూపాయి మారకపు విలువ వంటివి ఈక్విటీ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయి. సెప్టెంబరులో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ జరగనుందని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా వెల్లడించారు. అయితే అందరూ దీనికి ముందే రానున్న యూఎస్ ఆర్థిక డేటాపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే తయారీ రంగం PMI, వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగిత డేటా కూడా ఈ వారం విడుదల కానున్నాయి.

ఇటీవలి కాలంలో జాక్సన్ హోల్ సమావేశంలో పాల్గొన్న ఫెడ్ చైర్ కామెంట్స్ యూఎస్‌లో పాలసీ రేటు తగ్గింపు అంచనాలను పెంచేసింది. మార్కెట్లలో గతవారం ర్యాలీకి ఇది ప్రధాన కారణంగా నిలిచింది. వాహన విక్రయ గణాంకాల ప్రకటన మధ్య ఈ కంపెనీల షేర్లు పరిశీలనలో ఉంటాయి. ఈక్విటీ-సెంట్రిక్ మూవ్‌తో మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా పేర్కొన్నారు.
గతవారం మార్కెట్ల పనితీరును పరిశీలిస్తే.. సెన్సెక్స్ సూచీ 1,279.56 పాయింట్ల పెరుగుదలను చూసింది. అలాగే మరో బెంచ్ మార్క్ సూచీ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 412.75 పాయింట్ల పెరుగుదలను చూసింది. శుక్రవారం సెన్సెక్స్ సూచీ 231 పాయింట్లు లాభపడి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 82,365.77కి చేరుకుంది. అలాగే నిఫ్టీ సూచీ 83.95 పాయింట్లు పెరిగి 25,235.90 గరిష్ట స్థాయికి చేరుకుంది. మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వీపీ రీసెర్చ్ ప్రశాంత్ తాప్సే మాట్లాడుతూ.. విస్తృత ఆధారిత కొనుగోలు మద్దతు బెంచ్‌మార్క్ సూచీలను కొత్త గరిష్టాలకు నెట్టివేసిందన్నారు.


Click it and Unblock the Notifications