Stock Market: వచ్చే వారం మార్కెట్లు దారెటు..? ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోండి..
Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండు వారాల పాటు నష్టాలను నమోదు చేసిన తర్వాత అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై యథాతథ స్థితిని కొనసాగించటంతో మార్కెట్లు చివరి వారం లాభాల్లో ముగిశాయి. దీంతో దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్లు పుంజుకున్నాయి.
అలాగే రిజర్వు బ్యాంక్ గణాంకాల ప్రకారం సెప్టెంబరు త్రైమాసికంలో భారత సర్వీసెస్ సెక్టార్ ట్రేడ్ సర్ప్లెస్ నమోదు కావటం ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు చిగురింపజేసింది. ఇదే సమయంలో జీఎస్టీ వసూళ్లు అక్టోబరు మాసంలో 13 శాతం వృద్ధి చెంది రూ.1.72 లక్షల కోట్లకు చేరుకోవటం మార్కెట్లకు పాజిటివ్ సిగ్నల్స్ పంపింది. దీంతో గతవారం ముగింపు నాటికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 581 పాయింట్లు లాభపడి 64,364 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే మరో కీలక సూచీ నిఫ్టీ 183 పాయింట్లు లాభపడి 19,231 వద్ద నిలిచింది.

ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో 34 షేర్లు పెట్టుబడిదారులకు సానుకూల వృద్ధిని అందించాయి. మార్కెట్ స్థిరమైన దేశీయ స్థూల ఆర్థిక PMI, దేశీయ కంపెనీల నుంచి బలమైన కార్పొరేట్ ఆదాయాల నుంచి కూడా ప్రోత్సాహాన్ని పొందినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వెల్లడించారు. అలాగే ఫెడ్ వడ్డీ రేట్ల విషయంలో చేసిన ప్రకటన భవిష్యత్తుపై పాజిటివ్ సెంటిమెంట్లను పెంచటంతో చమురు ధరలు సైతం తగ్గుదలను నమోదు చేశాయి. ఆటో రంగం సానుకూల ఆటో అమ్మకాల గణాంకాలు ఉన్నప్పటికీ సవాళ్లను ఎదుర్కొంది. అయితే మిడ్ అండ్ స్మాల్-క్యాప్ రంగాలు బలమైన డిమాండ్, బలమైన ఆర్థిక దృక్పథంతో చెప్పుకోదగిన పనితీరును ప్రదర్శించాయి.
టెక్నికల్స్ పరిశీలిస్తే.. నిఫ్టీ ప్రస్తుతం 19200-19300 స్థాయిల వద్ద బలమైన ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ అంచున ఉంచబడిందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి పేర్కొన్నారు. గత వారం లాంగ్ నెగటివ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత వీక్లీ చార్ట్‌లో నిఫ్టీ సహేతుకమైన పాజిటివ్ క్యాండిల్‌గా ఏర్పడింది. అలాగే నిఫ్టీ స్వల్పకాలిక ట్రెండ్ సానుకూలంగానే ఉంది. దీనికి తోడు యూఎస్ బాండ్స్ ఈల్డ్స్ తగ్గటం ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవటానికి దోహదపడుతున్నాయి.


Click it and Unblock the Notifications