Budget Market: మార్కెట్ పెరుగుతుందా.. పడిపోతుందా..? గత బడ్జెట్లలో ఏం జరిగిందంటే..
Budget Market: దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆశలు ఈ సారి బడ్జెట్ పై భారీగా ఉన్నాయని ఇప్పటికే వెల్లడైంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో పాటు ప్రజలను వేధిస్తున్న ద్రవ్యోల్బణం వల్ల ఓటర్లను సంతృప్తి పరచాల్సిన బాధ్యత మోదీ సర్కారుకు చాలా కీలకమని చెప్పుకోవాలి.

15 ఏళ్లను గమనిస్తే..
గడచిన 15 ఏళ్ల కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ ఎలా స్పందించిందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ దేశ ఆర్థిక పరిస్థితినైనా అక్కడి స్టాక్ మార్కెట్లు ప్రతిబింబిస్తాయని అంటారు. అయితే కేవలం 2008 కేంద్ర వార్షిక బడ్జెట్ సమయంలో మాత్రమే ప్రీ-బడ్జెట్, బడ్జెట్ రోజు, బడ్జెట్ తరువాతి రోజుల్లో మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అయింది. అయితే ఈ సారి ఇదే జరుగుందా అనే విషయాన్ని వేచిచూడాల్సిందే.

బడ్జెట్ రోజున..
గడచిన పది కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల సమయంలో మార్కెట్లు పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. కేంద్రం ఏఏ రంగాలపై దృష్టి సారిస్తుంది, ఆయా రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తుందనే విషయాలతో పాటు దేశ ప్రజల ఆకాంక్షలకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి ప్రకటనలు చేస్తుందనేది మార్కెట్లకు చాలా కీలకమని చెప్పుకోవాలి. మార్కెట్ మూడ్ ప్రజల అభీష్టాలను ప్రతిబింబిస్తుందని తెలుస్తోంది.

2013 బడ్జెట్ సమావేశాలు..
కాంగ్రెస్ పాలిత యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అది మార్కెట్లను మెప్పించటంలో విఫలమైందని చెప్పుకోవాలి. ఆ తర్వాత 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలోని అరుణ్ జైట్లీ మధ్యంతర బడ్జెట్ సమయంలోనీ మార్కెట్లు నెగటివ్ గా ప్రతిస్పందించాయి. 2015లో మాత్రం లాభాల్లో బడ్జెట్ రోజు మార్కెట్లు ముగిశాయి. అలా 2018లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన చివరి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక 2019లో బడ్జెట్ ను పీయీష్ గోయల్ సమర్పించగా మార్కెట్లు నెగటివ్ గా స్పందించాయి.

నిర్మలమ్మ హయాంలో..
మోదీ సర్కార్ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ తొలిసారిగా 2019 జూలైలో తొలి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ రోజు మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ఆ తర్వాత నిర్మలమ్మ 2020, 2021, 2022 ప్రవేశపెట్టారు. అయితే వీటన్నింటిలో కేవలం 2021 బడ్జెట్ మాత్రం గట్టి లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ 1999 తర్వాత అత్యుత్తమ లాభాలను నమోుద చేసింది. 2022 బడ్జెట్ సమయంలో కూడా మార్కెట్లు స్వల్పంగా లాభాల్లో ముగిశాయి. ఈ సారి నిర్మలమ్మ మ్యాజిట్ మార్కెట్లను లాభాల బాట పట్టిస్తుందా అనేది రేపటి వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications