Year Ender 2024: ఇన్వెస్టర్లకు గందరగోళాన్ని మిగిల్చిన 2024 మార్కెట్లు.. ఎక్కడ లెక్కలు తప్పాయంటే?
Indian Stock Markets: భారతీయ స్టాక్ మార్కెట్లు 2024లో వినూత్నంగా తమ ప్రయాణాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ముందుగా బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాది తమ గరిష్ఠాలను అనేక సార్లు బ్రేక్ చేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. అయితే ఇటీవలి కాలంలో మార్కెట్లు భారీ కరెక్షన్ తో క్షీణతను కూడా చూసిన సంగతి తెలిసిందే. అధిక విలువలతో పాటు చాలా మంది ఇన్వెస్టర్లు సరసమైన ధరలకు చైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపటం వంటి కారణాలు మార్కెట్ల పతనానికి నాంది పలికిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పెట్టుబడిదారులు దృఢంగా ఉండగా, యువత మాత్రం ముందుండి నడిపిస్తున్నారు.
మెుత్తానికి భారతీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులను 2024లో పెద్ద గందరగోళానికి గురిచేశాయి. అయితే మార్కెట్లలో ఏం జరిగినా అవి తట్టుకునేందుకు అండగా ఈ ఏడాది పుట్టుకొచ్చిన హీరోనే రిటైల్ ఇన్వెస్టర్లు. అవును కరోనా కాలం నుంచి పెట్టుబడి ప్రాముఖ్యతపై అవగాహన పెంచుకున్న పెట్టుబడిదారులు బలమైన భాగస్వాములుగా నిలిచి విదేశీ మదుపరులు అమ్మకాలను ప్రేరేపించినప్పటికీ మార్కెట్లు తమ స్థిరత్వాన్ని కోల్పోకుండా వెన్నుదన్నుగా నిలిచారు. పైగా ఎక్కువ శాతం మంది ప్రజలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ డబ్బులు తిరిగి స్టాక్ మార్కెట్లలోకి ప్రవహించాయి. ఇటీవలి కాలంలో మార్కెట్లు భారీగా పతనం అయినప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు డిప్స్‌లో కొనుగోలు చేసి మంచి రాబడులను కూడా ప్రస్తుతం పొందుతున్నారు.

కొన్ని నెలల క్రితం వరకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీలపై ఆసక్తి చూపిన చాలా మంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం బ్లూచిప్ కంపెనీలకు తిరిగి వస్తున్నారు. బలహీన మార్కెట్లలో బలమైన షేర్లను హోల్డ్ చేయటం పోర్ట్ ఫోలియోకు చాలా కీలకంగా వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో 2024లో వివిధ రంగాల పనితీరును పరిశీలిస్తే.. రియల్ ఎస్టేట్, ఫార్మాస్యూటికల్స్ స్టాక్స్ అత్యద్భుతమైన పనితీరుతో ఉత్తమ రాబడులను ఇన్వెస్టర్లకు అందించాయి. అలాగే మీడియా, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాలు ఇబ్బంది పడగా.. ఆటో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సహా ఇతర రంగాలు పటిష్టమైన లాభాలను నమోదు చేశాయి. ఇదే క్రమంలో చివరిగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరింత నిరాడంబరమైన రాబడిని పెట్టుబడిదారులకు అందించాయి.
గ్లోబల్ ఎకనామీల్లోని ప్రతికూలతలతో పాటు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లను కమ్మేసిన సంగతి తెలిసిందే. కానీ భారత మార్కెట్ మాత్రం ఈ చీకట్లలో కొత్త ఆశలతీరంగా అవతరించింది. దీంతో అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ సహచరులను అధిగమించి ఉత్తమ రాబడులను అందించింది. బలహీన ఆదాయాలు మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఇది పెరిగిన అస్థిరత మరియు బలహీనమైన మార్కెట్ సెంటిమెంట్‌కు దారితీసింది. గ్రామీణ డిమాండి, పెరిగిన ప్రభుత్వ వ్యయం కారణంగా ద్వితీయార్ధంలో రికవరీ ఆశించబడుతుంది. ఇదే క్రమంలో జీడీపీ వృద్ధి అంచనాలు భారీగా తక్కువగా ఉండటంతో భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందా అనే అనుమానాలు చాలా మందిలో పెరిగిపోతున్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.


Click it and Unblock the Notifications