Stock Markets: నేడు ముంబైలో లోక్ సభ ఎన్నికలు ఐదవ ఫేజ్ కింద కొనసాగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు సెలవులో ఉన్నాయి. దీంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో పూర్తిగా ట్రేడింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రేడర్లు, విదేశీ ఇన్వెస్ర్లు, దేశీయ రిటైల్ పెట్టుబడిదారుల కన్ను ఎన్నికల ఫలితాలపై పడింది. దీంతో చాలా మంది ఫలితాలపై తమ ఆట మెుదలెడుతున్నారు.
ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్ ప్రతిచర్యలను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున పెట్టుబడిదారులు గత కొన్ని వారాలుగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఈసారి ఎన్నికలకు దేశంలో తక్కువ ఓటరు టర్న్‌అవుట్‌లు పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేయడంతో సెన్సెక్స్ క్షీణతను చూడగా.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరించుకోవటాన్ని ప్రేరేపించిందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే వారు తమ పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నోమురా విశ్లేషకులు మార్కెట్ తక్కువ ఓటింగ్ శాతంపై అతిగా ప్రతిస్పందిస్తున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే దీనికి ఎన్నికల ఫలితాలకు స్పష్టమైన లింక్ ఉండకపోవచ్చని వాదించారు.

చాలా మంది అంచనాల ప్రకారం మార్కెట్లలో బెట్టింగ్ ప్రకారం 13 మే 2024 నాటికి ఈసారి బీజేపీ 300 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది కొంత మంది ఇన్వెస్టర్లకు నిరాశకు కలిగించవచ్చు. సుస్థిర ప్రభుత్వాన్ని నడిపేందుకు బీజేపీ మెజారిటీ మార్కు 272 సీట్లు చేరుకోవడం ఆచరణాత్మక అవసరమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి 303 సీట్ల కంటే ఎక్కువ వచ్చాయి. అయితే ఈసారి వీటి కంటే ఎక్కువ సీట్లు గనుక వచ్చినట్లయితే దేశంలో బీజేపీ హవా మరింతగా పెరుగుతోందని, పార్టీ చొచ్చుకుపోతున్నట్లు ఇది సుచిస్తుందని ఇన్వెస్టెక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
బీజేపీ మెజారిటీ 272, మెుత్తం NDAకి 400+ సీట్లు వచ్చినట్లయితే అది పెట్టుబడిదారుల నాడిని శాంతపరచవచ్చని నోమురా అంచనా వేస్తోంది. ఇది దేశంలో స్థూల-ఆర్థిక స్థిరత్వానికి మద్దతునిస్తుందని, విధాన కొనసాగింపును ప్రోత్సహిస్తారని నోమురా అంచనా వేసింది. ఇదే గనుక జరిగితే ఫైనాన్షియల్స్, కన్స్యూమర్ డిస్క్రీషనరీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, PSUలు మెరుగైన పనితీరును కనబరుస్తాయని వెల్లడించింది. అయితే ఐటీ సేవలు, హెల్త్ కేర్ రంగాల పనితీరు తక్కువగా ఉండొచ్చని పేర్కొంది.
ఒకవేళ బీజేపీకి తక్కువ మెజారిటీ ఎన్నిక ఫలితాల వేళ వచ్చి, ఎన్‌డీఎ కూటమి మెజారిటీని దాటితే నోమురా ప్రకారం.. పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు, పీఎస్‌యులలో అమ్మకాలు అంచనా వేస్తుంది. అయితే బ్యాంకింగ్, కన్జూమర్ అండ్ ఫార్మాస్యూటికల్‌లు మెరుగైన పనితీరు కనబరుస్తాయని అంచనా వేస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రతిపాదిత ఇండియా కూటమి విజయాన్ని సాధిస్తే నోమురా ప్రకారం.. ఆర్థిక, పారిశ్రామిక/అవస్థాపన, వినియోగదారు విచక్షణ, PSUలలో అమ్మకాలను ఆశించింది. అయితే కన్జూమర్ స్టేపుల్స్, IT సేవలు, ఫార్మాస్యూటికల్‌లు మెరుగైన పనితీరు కనబరుస్తాయని అంచనా వేస్తోంది.


Click it and Unblock the Notifications