Free Insurance: ఉచితంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్.. ఇలా పొందండి..!
Insurance News: కరోనా మహమ్మారి ఆవరించి ప్రజల జీవితాలను కబళించిన తర్వాత చాలా మంది బీమా ఆవస్యకతను గుర్తించారు. దీంతో టర్మ్ ఇన్సూరెస్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వంటి ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ భారీగానే పెరిగింది.
అయితే ప్రజలు ఉచితంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పొందటానికి అవకాశం ఉందనే అవకాశం ఉందని చాలా మందికి ఇంకా తెలియదు. అవును దేశంలోని చాలా బ్యాంకులు తమ డెబిట్ కార్డ్‌లతో కస్టమర్లకు అందిస్తున్న వివిధ ప్రయోజనాల్లో ఇన్సూరెన్స్ కూడా ఉందని గ్రహించాలి. అయితే అవగాహన లేకపోవటంతో చాలా మంది దీనిని ఉపయోగించుకోవటం లేదు. దేశంలోని ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకులు తమ డెబిట్ కార్డులపై ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

వాస్తవానికి బ్యాంకులు అందించే ఉచిత బీమా కవరేజీకి ఎలాంటి అదనపు ప్రీమియం సొమ్మును చెల్లించక్కర్లేదు. ఇది కస్టమర్లకు సదరు బ్యాంకులు అందించే కాంప్లిమెంటరీ సదుపాయంగా ఉంది. అయితే చాలా బ్యాంకులు తమ డెబిట్ కార్డ్‌లతో పాటు కొన్ని షరతులతో తమ కస్టమర్‌లకు ఉచిత ప్రమాద బీమాను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ చెప్పినట్లుగా కార్డును వినియోగించకపోతే మాత్రం బీమా క్లెయిమ్ పొందటం ఎట్టిపరిస్థితుల్లోనూ పొందట కుదరదని గుర్తుంచుకోండి.
ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మిలీనియం డెబిట్ కార్టు కస్టమర్లకు రూ.5 లక్షల వరకు యాక్సిడెంటల్ బీమా సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే సదరు వ్యక్తి విమాన ప్రమాదంలో విదేశంలో చనిపోతే మాత్రం రూ.కోటి కవరేజ్ అందిస్తోంది. ప్రమాదం జరిగిన సందర్భంలో సొమ్ము పొందాలంటే కనీసం 30 రోజుల్లో ఒక్కసారైనా డబ్బు బదిలీకి కార్డును వినియోగించి ఉండాల్సి ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ క్లాసిక్ డెబిట్ కార్డ్ గత 30 రోజుల్లో కనీసం రూ.500 రెండు లావాదేవీలు జరిగితే ఉచిత ప్రమాద బీమాను అందిస్తుంది. ఇలా వేరువేరు బ్యాంకులు బీమాకు చిన్న రూల్స్ పెట్టాయి. కానీ యూపీఐ లావాదేవీలకు ఎలాంటి అర్హత లేదని గుర్తుంచుకోవాలి. POS లేదా ఇ-కామర్స్ సైట్‌లలో ఆన్‌లైన్ లావాదేవీలు అర్హులు.
బీమా క్లెయిమ్ పొందటానికి అవసరమైన పత్రాలు:
బ్యాంక్ అందించిన డెబిట్ కార్డు హోల్డర్ ఏదైనా ప్రమాదంలో మరణిస్తే అతని కుటుంబం బ్యాంకుకు వెళ్లి బీమా మెుత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం సమర్పించాల్సిన పత్రాల జాబితాను పరిశీలిస్తే...
- నామినీ వివరాలు (పేరు, ఫోన్ నంబర్ చిరునామా)
- క్లెయిమ్ సమ్
- అష్యూర్డ్ డెత్ సర్టిఫికేట్
- శవపరీక్ష రిపోర్ట్ యాక్సిడెంటల్
- డెత్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్
- డెబిట్ కార్డ్ వివరాలు
- మీడియా
- హాస్పిటల్‌లో డెత్ రిపోర్ట్
- నామినీ వివరాలు లేకపోతే హెయిర్‌షిప్ సర్టిఫికెట్‌ను


Click it and Unblock the Notifications