SBI on Digital Arrest: భారతదేశంలో సైబర్ క్రైమ్స్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవలి కాలంలో వీటిపై ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నప్పటికీ, నేరగాళ్లు వృద్ధులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులను టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు నేరగాళ్ల నుంచి తమ కస్టమర్లను కాపాడుతూ శభాష్ అనిపించుకుంటున్నారు.
ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్టుల పేరుతో మోసగాళ్లు హైటెక్ దందా నడుపుతున్నారు. నిజమైన కోర్టు, పోలీసు అధికారుల సెటప్ వీడియో కాల్లో ఏర్పాటు చేసి నిజమైన అధికారుల్లాగా మోసం చేస్తున్నారు. హైదరాబాదులో 61 ఏళ్ల చిన్న పిల్లల డాక్టర్ ఏసీ గార్డ్ ఎస్బీఐ బ్రాంచ్ కస్టమర్. ఇటీవల ఆయనను మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేసినట్లు కాల్ చేశారు. ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు సదరు డాక్టర్ ఖాతాలో ఉన్న డబ్బును వెంటనే విత్ డ్రా చేయాలని అలాగే ఆయనకు ఉన్న డిపాజిట్లను వెంటనే విత్ డ్రా చేయాలని సూచించారు. ఈ క్రమంలో డాక్టర్ తన డబ్బును వెనక్కి తీసుకునేందుకు బ్రాంచ్ కి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి ఉద్యోగి సూర్య స్వాతి ఆయన భారీ మెుత్తాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని కంగారు పడటాన్ని గ్రహించారు. అయితే ఇంత మెుత్తాన్ని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో కనుక్కునే ప్రయత్నం చేయగా విషయం తెలుసుకున్నారు. దీంతో సదరు కస్టమర్ రూ.13 లక్షలు పోగొట్టుకోకుండా కాపాడగలిగారు. వార్తా పత్రికల్లో ఇలాంటి మోసాలకు సంబంధించిన న్యూస్ కూడా సదరు డాక్టర్ కి చూపించారు.

ఇలాంటి సంఘటనే హైదరాబాదులో మరో పెద్దాయనకూ ఎదురైంది. అయితే ఈ సారి మోసగాళ్లు 78 ఏళ్ల డాక్టరును టార్గెట్ చేశారు. ఆయనకు ఎస్బీఐ లోతుకుంట బ్రాంచీలో అకౌంట్ ఉంది. ఆయన తన రూ.30 లక్షల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ క్లోజ్ చేసేందుకు వెళ్లారు. తన భార్య అపోలో ఆసుపత్రిలో చికిత్సకు ఈ డబ్బు అవసరమని ఆయన పేర్కొన్నాడు. అయితే కస్టమర్ కంగారుగా ఉండటాన్ని బ్యాంక్ సిబ్బంది గమనించారు. ఇదే క్రమంలో దీనికి సంబంధించి నిరంతరం అప్ డేట్స్ అడుగుతూ సదరు డాక్టర్ కి కాల్స్ రావటం కూడా వారు గమనించారు. కస్టమ్స్ ఆఫీసర్ అంటూ నిందితులు డాక్టరుకు ఫోన్ చేశారు. ఆయన పేరుతో ఉన్న ఒక పార్సిల్ మలేషియా నుంచి వచ్చిందని ఆయన ఆధార్ కార్డ్ వాడి 30 బ్యాంక్ ఖాతాలు తెరచి రూ.88 కోట్లు మనీలాండరింగ్ జరిగిందని సదరు మోసగాళ్లు చెప్పారు. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ డబ్బు వెంటనే తమకు పంపాలని వారు డిమాండ్ చేశారు. ఇది నిజమే అనుకున్న డాక్టర్ బ్యాంకుకు వెళ్లగా బ్యాంక్ అధికారులు సకాలంలో పోలీసులకు సమాచారం అందించటంతో దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
ఇటీవలి కాలంలో ఇదే కాక పేటీఎం కస్టమర్ కేర్ పేరుతో సైతం మోసగాళ్లు కాల్ చేస్తున్నారు. మర్చంట్ అకౌంట్స్ ఉన్న వ్యాపారులను టార్గెట్ చేస్తూ వారి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బును కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదైనా సర్వీస్ ప్రాబ్లం కోసం నిరీక్షిస్తున్న వారికి కంపెనీ సేవల్లో లోపాలకు డబ్బు తిరిగి చెల్లిస్తుందంటూ వారి బ్యాంక్ ఖాతాలు లేదా క్రెడిట్ కార్డ్ వివరాలను కనుక్కుంటున్నారు. అలా కస్టమర్లను మాటల్లో పెట్టి వేలకు వేలు కాజేస్తున్న ఘటనలు ఇటీవల బయటపడుతున్నాయి.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications