Gold News: పెళ్లిలో తండ్రి గిఫ్ట్ ఇచ్చిన బంగారం అమ్మితే టాక్స్ కట్టాలా..? తప్పక తెలుసుకోండి..
Gold Taxation: భారతదేశంలో బంగారం అంటే అమితమైన ప్రేమ ప్రజలకు ఎక్కువగా ఉంటుంది. తమకు ఉన్నంతలో గోల్డ్ కొనుక్కోవాలని సాధారణ మధ్యతగతి నుంచి ధనవంతుల వరకు ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటారు. అలా పోగుచేసిన బంగారం, వెండిని చాలా మంది తమ వారసులకు చట్టపరంగా లేదా గిఫ్ట్స్ రూపంలో శుభకార్యాల సమయంలో అందిస్తూనే ఉంటారు.
దేశంలో సాంప్రదాయం ప్రకారం చాలా మంది తల్లిదండ్రులు కుమార్తెలకు వివాహ సమయంలో తమకు తోచినంతలో బంగారాన్ని బహుమతిగా ఇస్తుంటారు. అయితే వీటికి సంబంధించిన కొన్ని అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది పెళ్లికి తండ్రి బహుమతిగా అందించిన బంగారు ఆభరణాలను కుమార్తె విక్రయిస్తే దానిపై వచ్చే డబ్బుకు టాక్స్ చెల్లించాలా అక్కర్లేదా అనే విషయం గురించే. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో చాలా మంది తాము పొందిన డబ్బుపై ఎలాంటి పన్నులు చెల్లించక్కర్లేదని భావిస్తుంటారు. అయితే చట్టప్రకారం టాక్స్ వర్తిస్తుందా లేదో ఇప్పుడు గమనిద్దాం..

ఆభరణాల అమ్మకంపై వచ్చిన డబ్బుపై పన్ను విధించే విషయంలో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదని చాలా మంది భావిస్తుంటారని టాక్స్ నిపుణులు బల్వంత్ జైన్ వెల్లడించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో అందరి నుంచి పొందిన బహుమతుల విలువ మెుత్తంగా రూ.50 వేలు మించితే దానిని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో బహుమతులపై పన్ను విధించే ఈ నియమానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పేర్కొన్న బంధువుల నిర్వచనంలో తల్లిదండ్రులు చేర్చబడినందున వారి నుంచి స్వీకరించబడిన బహుమతులు ఈ నిబంధనల పరిధికి వెలుపల ఉన్నాయి. కాబట్టి మీ వివాహ సమయంలో మీ తండ్రి నుంచి పొందిన బహుమతి విలువ మీ ఆదాయంగా పరిగణించబడదు.
బహుమతి అందుకున్న సమయంలో ఆభరణాల విలువ ఆదాయంగా పరిగణించబడనప్పటికీ.. ఆభరణాలను విక్రయించినప్పుడు మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత మాత్రం కుమార్తెపై తప్పక ఉంటుందని టాక్స్ నిపుణులు బల్వంత్ జైన్ వెల్లడించారు. ఈ క్రమంలో కుమార్తె, తండ్రి కలిసి ఆభరణాలను కలిగి ఉన్న ఉమ్మడి హోల్డింగ్ వ్యవధిని లెక్కించిన తర్వాత మూలధన లాభాలు దీర్ఘకాలికంగా లేదా స్వల్పకాలిక స్వభావాన్ని కలిగి ఉన్నాయా అనే దానిపై పన్ను బాధ్యత పరిమాణం ఆధారపడి ఉంటుందని చెప్పారు.
ఈ క్రమంలో కంబైన్డ్ హోల్డింగ్ పీరియడ్ 24 నెలలు ఉంటే లాభాలు స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణించబడతాయి. లేదా 24 నెలల కంటే ఎక్కువ కాలం హోల్డింగ్ చేస్తే మూలధన లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణించి 12.50% ఫ్లాట్ రేటుతో పన్ను విధించబడుతుంది.


Click it and Unblock the Notifications