Gold Price Prediction 2025: భారతదేశంలో పసిడి ప్రియులు ఎప్పుడెప్పుడు ధరలు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు. 2024లో నవంబర్ వరకు దాదాపు 28 శాతం రాబడిని పసిడి పెట్టుబడులు అందించాయి. గడచిన దశాబ్ధకాలంలో ఇదే గోల్డ్ ఇచ్చిన అత్యుత్తమ రాబడిగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలు, యుద్ధ వాతారవరణం, ద్రవ్యోల్బణం వంటి కారకాలు పసిడి ధరలు ఎన్నడూ చూడని శిఖరాల వరకు తీసుకెళ్లాయి.
అలాగే 2024లో అనేక దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు అధిక స్థాయిలో గోల్డ్ కొనుగోళ్లు నిర్వహించటం కూడా రిటైల్ గోల్డ్ ధరలు పెరగటానికి దారితీసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లోబల్ అనిశ్చితులు బంగారంపై ప్రజలు పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపు తర్వాత గోల్డ్ ధరలు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందరి చూపు 2025లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనే అంచనాలపై దృష్టి సారించేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న ఏడాదిలో పసిడి ధరలు మోస్తరు వృద్ధిని చూస్తాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా అంచనాలను ప్రకటించింది. గ్లోబల్ డీజీపీ, ద్రవ్యోల్బణంతో పాటు బాండ్ ఈల్డ్స్ వంటి పరిణామాలు బంగారం ధరలలో స్వల్ప వృద్ధిని సూచిస్తున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.

గడచిన 45 ఏళ్ల పసిడి, వెండి ధరల చరిత్రను పరిశీలిస్తే.. 2024లో ఈ రెండు లోహాలు అత్యధిక వృద్ధిని సాధించాయి. ఇది పెట్టుబడిదారులకు సానుకూలమైన అంశంగా ఉన్నప్పటికీ, రిటైల్ కొనుగోలుదారులకు పెద్ద షాకింగ్ నిర్ణయంగా చెప్పుకోవచ్చు. 1979లో అత్యంత వేగంగా 133 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు, బాండ్ ఈల్డ్స్ లేదా ఇతర ఆర్థిక సాధనాల కంటే అత్యుత్తమ రాబడిని అందించింది. ఈ కాలంలో వెండి 36 శాతానికి పైగా లాభాన్ని ఇచ్చింది. అమెరికాతో సహా ఇతర పెద్ద కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం కొనసాగిస్తే, బంగారం వైపు పెట్టుబడిదారుల మొగ్గు మరింత వేగంగా పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా బంగారం కొనుగోళ్లను నిర్వహించిన సంగతి తెలిసిందే.
గడచిన దశాబ్ధకాలంగా గోల్డ్ రేట్లు రెండింతలకు పైగా పెరిగాయి. ఈ క్రమంలో 2014లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.29,462 వద్ద ఉండగా, 2024 అక్టోబరులో 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా రూ.82,000 స్థాయికి చేరుకుంది. అయితే ఇటీవలి కాలంలో కొంత తగ్గుదలను చూశాయి. అయితే కొత్త సంవత్సరం అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 తర్వాత యూఎస్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించటానికి, స్థానికులకు ఉపాధిని పెంచటానికి ఎలాంటి ప్రకటనలు చేయనున్నారనే అంశాలు కూడా పసిడి ధరలను ప్రభావితం చేస్తాయని నిపుణలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య పోరు తీవ్రరూపం దాల్చితే గోల్డ్ రేట్లు మరింతగా పెరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కొనసాగితే గోల్డ్ రేట్లు భారీ పెరుగుదలను చూడవచ్చని, దీనికి ప్రధానంగా సెంట్రల్ బ్యాంకుల నుంచి డిమాండ్ కారణంగా మారే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications