Investment: మన పూర్వీకుల నుంచి సురక్షితమైన పెట్టుబడి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే పొదుపు పథకం బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్. ఇందులో రాబడి తక్కువగానే ఉన్నప్పటికీ రక్షణ ఎక్కువగా ఉండటమే ప్రజాధరణ పొందటం వెనుక కారణం. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలోకి తీసుకుంటే రిటర్న్స్ చాలా తక్కువని చెప్పుకోవాలి.

ఎక్కువ రిటర్న్స్..
ఈ క్రమంలో అధిక రాబడిగల పెట్టుబడి మార్గాలను అన్వేషించేవారికి బాండ్స్ సరైనవిగా కనిపిస్తున్నాయి. అయితే వీటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాండ్స్ మాత్రమే కాక ప్రైవేటు కంపెనీలవి కూడా ఉంటాయి. ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ తన వడ్డీ రేట్లను పెంచుతున్న తరుణంలో ప్రైవేట్ కార్పొరేట్ బాండ్స్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే చాలా ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి.

అధిక రాబడికి మార్గాలు..
రెండంకెల వడ్డీ ఆదాయాన్ని సాధించాలని భావించే వారికి ముందుగా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జారీ చేసిన అన్‌సెక్యూర్డ్ కార్పొరేట్ బాండ్‌లు 14.25% రాబడితో ఆకర్షిస్తున్నాయి. దీని తర్వాత ముత్తూట్ ఫిన్‌కార్ప్ జారీ చేసిన సబ్‌డెట్ కార్పొరేట్ బాండ్‌లు 10.50% ఆదాయాన్ని అందిస్తున్నాయి. చివరిగా పిరమల్ క్యాపిటల్ & హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్'సెక్యూర్డ్' కేటగిరీ బాండ్‌లు 11.4% రాబడిని అందిస్తోంది. ఈక్విటీ షేర్లతో పోల్చితే బాండ్స్ కొంతమేర సురక్షితమైనవి.

బాండ్స్ పనితీరు..
బాండ్స్ అనేవి డెట్ ఇన్స్ట్రుమెంట్స్. కంపెనీలు, ప్రభుత్వాలు తమ అవసరాల కోసం డబ్బును సేకరించేందుకు వీటిని జారీ చేస్తుంటాయి. వీటికి కొంత కూపన్ రేటును చెల్లిస్తుంటాయి. మెచ్చూరిటీ సమయంలో డబ్బును తిరిగి చెల్లిస్తుంటాయి. ప్రభుత్వ బాండ్ల విషయంలో డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి సురక్షితం. అందుకే ఏదైనా బాండ్లలో ఇన్వెస్ట్ చేసే ముందు వాటి రేటింగ్ పరిగణలోకి తీసుకోవటం చాలా కీలకం.

ఇన్వెస్టర్లకు ప్రయోజనం..
పెట్టుబడిదారులకు ప్రయోజనం ఏమిటంటే బాండ్లను అవసరమైన సమయాల్లో నగదుగా మార్చుకోవచ్చు. అందుకే వీటి పనితీరు గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం సరైనది. ఇలాంటి కొత్త పెట్టుబడి వ్యూహాలను వినియోగించే ముందు మీ ఆర్థిక నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవటం ఉత్తమమైనది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications