PM Kisan Scheme: దేశంలోని రైతులకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ యోజనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ఏడాదికి రూ.6000 మెుత్తాన్ని మూడు దఫాలుగా చెల్లిస్తోంది.
ఇటీవల ప్రభుత్వం 17వ విడత మెుత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసింది. అయితే ఇప్పుడు అందరి చూపు 18వ విడత ఎప్పుడు వస్తుందనే తేదీపై ఉంది. ఈ క్రమంలో కొంత మంది దరఖాస్తు చేసినప్పటికీ ఆర్థిక సహాయాన్ని అందుకోలేకపోయారు. అయితే కారణాల వద్ద తమ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా లబ్ధిదారుల అర్హతకు ప్రభుత్వం ఇచ్చిన ప్రమాణాలకు అనుగుణంగా రైతు దరఖాస్తు అప్‌డేట్‌గా లేనప్పుడు వారి పేర్లు జాబితా నుంచి తీసివేయబడతాయి. అందువల్ల దీనిని గమనించడానికి అధికారిక పోర్టల్ సందర్శించి వివరాలు తెలుసుకోవటం ముఖ్యం.

పీఎం కిసాన్ కింద వాయిదాలు ఆటంకం లేకుండా పొందేందుకు e-KYC ప్రక్రియను పూర్తి చేయడం అవసరమని అందరూ గుర్తుంచుకోవాలి. ఇది పూర్తి చేయకపోతే వెంటనే దానిని పూర్తి చేయండి. అలాగే పూరించిన దరఖాస్తులో లోపాలు, తప్పుడు బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయటం వంటివి లేకుండా ఉండేలా చూసుకోవటం ముఖ్యం.
కింది ప్రక్రియను పాటించటం ద్వారా రైతులు PM కిసాన్ పథకంలో తొలగించబడిన పేర్ల జాబితాను పరిశీలించవచ్చు..
Step 1: పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ చేయండి.
Step 2: హోమ్ పేజీలో "డ్యాష్‌బోర్డ్"పై క్లిక్ చేయండి.
Step 3: రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, గ్రామానికి సంబంధించిన వివరాలు పూరించి "షో" పై క్లిక్ చేయండి.
Step 4: ఆధార్ స్టేటస్‌లో "తిరస్కరించబడింది" ఎంచుకోండి.
Step 5: పీఎం కిసాన్ సమన్ ఫండ్ తిరస్కరణలు, తిరస్కరణకు గల కారణాల గురించిన సమాచారాన్ని కలిగి ఉన్న జాబితా వస్తుంది. అందులో తిరస్కరణ కారణాలను పరిశీలించవచ్చు.


Click it and Unblock the Notifications