Tech News: దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలపై ఇప్పుడు యువత దృష్టి ఎక్కువగా ఉంది. టెక్ రంగంలో ఉపాధి అవకాశాలకు ఈ కంపెనీలు పెద్ద పేరు పొందిన సంగతి తెలిసిందే.
ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగింపులో మొత్తం ఉద్యోగుల సంఖ్యను 50,000కు పైగా తగ్గించనున్నట్లు ప్రకటించాయి. వాస్తవానికి టెక్ రంగంలో అధిక సంఖ్యలో ఉద్యోగులను ప్రతి ఏటా నియమించుకునేందుకు టాప్-5 టెక్ కంపెనీలు క్యాంపస్ డ్రైవ్స్, వాకిన్స్, ఐఐటీ-ఐఐఎమ్ వంటి సంస్థల నుంచి ఇన్ టేక్స్ ఉండేవి. కానీ ఈ ఏడాది ఆ కోలాహలం పూర్తిగా కనుమరుగైపోయింది. వాస్తవానికి దీనికి ముందు కరోనా లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులను పోటీ పడుతూ ఎక్కువ జీతాలు చెల్లించి టెక్కీలను నియమించుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండు విషయాలు మాత్రం టెక్కీలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మెుదటిది ప్రపంచ వ్యాప్తంగా అలుముకున్న ఆర్థిక మాంద్యం వల్ల సాంకేతిక సేవల్లో పెట్టుబడులు తగ్గి కొత్త డీల్స్ కొరవడటం కాగా రెండోది ఏఐ రంగంలో వస్తున్న పెను మార్పులు ఉద్యోగుల మెడపై కత్తి పెడుతున్నాయి. దీంతో ప్రస్తుతం భారతీయ ఐటీ పరిశ్రమలోని కంపెనీలు వ్యాపారాన్ని నడిపించటం నుంచి వ్యాపారంలో మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది కొత్త నియామకాల్లో మందగమనానికి దారితీస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత ఐటీ రంగంలో ప్రస్తుతం పనిచేస్తున్న 5.4 లక్షల మంది ఉద్యోగుల సంఖ్య చాలా సవాలుగా ఉందని టీమ్ లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ మునిరా లోలివాలా అన్నారు. ఏఐ ఆధిపత్యం కారణంగా స్కిల్ డెవలప్మెంట్ రాబడి, నియామకాలపై స్వల్పకాలిక ఒత్తిడి వచ్చినప్పటికీ.. చివరికి AI- ఎనేబుల్డ్ స్కిల్స్‌కు డిమాండ్ పెరుగుతుందని HCL టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం కఠినమైన వ్యాపార వాతావరణం, AI ఆధిపత్యంలో ఈ-కామర్స్, GenAI, IoT, బిగ్ డేటా ఫీల్డ్‌లలో నైపుణ్యం కలిగిన నిపుణులకు అధిక డిమాండ్ ఉంది. ఆరు నెలల్లో ఈ కేటగిరీ ఉద్యోగులకు డిమాండ్ దాదాపు 20 శాతం పెరిగిందని క్యూస్ ఐటీ స్టాఫింగ్ కంపెనీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కపిల్ జోషి తెలిపారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications