2025 Gold Forecast: బంగారంతో భారతీయులకు విడదీయలేదని అనుబంధం సెంటిమెంటల్ గా ఉంటుంది. ఇంట్లో చిన్న శుభకార్యం నుంచి పెద్ద ఫంక్షన్ల వరకు అన్నింటిలోనూ పసిడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. 2024లో గోల్డ్ పెట్టుబడిదారులకు అక్టోబర్ నాటికి 35 శాతం రాబడిని అందించింది. అయితే అక్టోబరులో 5 శాతం పతనాన్ని చూసినప్పటికీ మెరుగైన రాబడులను అందించటంతో చాలా మంది పెట్టుబడిదారులు రికార్డు రిటర్న్స్ పొందారు.
గడచిన నాలుగు దశాబ్ధాల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచింది. మెుత్తానికి పసిడి పెట్టుబడిదారులు 2024లో 28 శాతం రాబడిని అందించింది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది పూర్తవుతున్న వేళ 2025లో రాబడి ఎలా ఉంటుందనే గందరగోళంలో పెట్టుబడిదారులు ఉన్నారు. వాస్తవానికి గడచిన వారంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2025లో మాత్రం రేట్ల కోతలు తక్కువగా ఉంటాయని వెల్లడించిన వేళ డాలర్ బలపడటంతో పాటు ట్రెజరీ ఈల్డ్స్ పెరిగాయి. అయితే ఇదే క్రమంలో పసిడి ధరలు మాత్రం పతనాన్ని చూశాయి.

నిపుణుల ప్రకారం మార్కెట్లు ఆసక్తిగా చూసే సాంకేతిక స్థాయిలు 2634 డాలర్ల మార్కును ఉల్లంఘిస్తే గణనీయమైన అమ్మకాలను ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు. బులియన్ రికార్డ్-బ్రేకింగ్ ర్యాలీ మధ్య రిటైల్ ఇన్వెస్టర్ల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి CME జనవరిలో ఒక ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఒప్పందాన్ని ప్రారంభించనుంది. పెరుగుతున్న అనిశ్చిత ప్రపంచ వాతావరణంలో ఎదురయ్యే ప్రతికూలతల నుంచి రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం కొనుగోళ్లను భారీగా పెంచటం కూడా ధరల పెరుగుదలకు దారితీస్తోంది. ఈ క్రమంలో ఇండియా ఈ ఏడాది దాదాపు 77 టన్నులను కొనుగోలు చేసింది. కరెన్సీ విలువ పతనాన్ని రక్షించటం కోసం సెంట్రల్ బ్యాంకులు ఈ చర్య చేపడుతున్నాయి.
రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇరాక్, సిరియా వంటి ఉద్రిక్తతలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ప్రజల ఆకర్షణకు మద్దతునిస్తోంది. దీనికారణంగా ప్రాంతీయ అస్థిరత గురించి ఆందోళనలను పెంచుతుందని ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ కూడా హెచ్చరించారు. అలాగే రానున్న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇతర దేశాలపై విధించనున్న సుంకాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తాయనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. డాలర్ డిమాండ్ పెరగటంతో పాటు చైనా పాలసీ మార్పులు యువాన్ ను బలహీనంగా మారుస్తోంది. ఇలాంటి పరిస్థితులు కరెన్సీలపై ఒత్తిడిని పెంచుతోందని నిపుణులు చెబుతోంది.
నేటి పసిడి ధరలు..
వరుసగా రెండు రోజుల నుంచి పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7745 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7745 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.100 తగ్గి నేడు రూ.98,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications