Gold News: భారతీయులకు పసిడితో ఉన్న అనుబంధం విడదీయలేనిది. వాస్తవానికి ఏ చిన్న శుభకార్యం జరిపించాలన్నా అందులో ఖచ్చితంగా పసిడికి తప్పనిసరిగా పాత్ర ఉంటుంది. అయితే ఇప్పుడు అందరూ వాస్తవానికి దేశంలో స్టాక్స్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు వాటి వెంటపడుతున్నారు. అందువల్ల నిజానికి దేనిలో ఎక్కువ రాబడిని ప్రజలు పొందారనే చర్చ సర్వత్రా కొనసాగుతోంది.
ప్రస్తుత సమయంలో గ్లోబల్ ఉద్రిక్తతలు, అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభంతో పాటు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గటం వంటి కారణాలు గోల్డ్ రేట్లను ఈ ఏడాది జూలైలోనూ ఆల్-టైమ్ గరిష్ట స్థాయిల వద్ద స్థిరంగా కొనసాగేందుకు ప్రేరేపించాయి. అయితే శ్రావణమాసం ప్రారంభం కావటంతో పాటు పాటు రక్షాభందన్, దీపావళి దగ్గరకు రావటం వంటి వాటితో చాలా మంది వినియోగదారులు ఆభరణాలు షాపింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొంత మంది క్రమంగా పెరుగుతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వం దిగుమతి సుంఖాన్ని తగ్గించినప్పటికీ అంతర్జాతీయంగా ధరల పెరుగుదల ఉపశమనాన్ని ఆవిరిచేస్తోంది.

1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇది అనేక పెట్టుబడి ఎంపికలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా బంగారంతో పాటు ఈక్విటీలతో కూడిన వాటిని ప్రభావితం చేసింది. ధరలను పరిశీలిస్తే.. 1947 నుంచి దేశంలో బంగారం ధర అనూహ్యంగా పెరిగాయి. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.88 వద్ద ఉంది. అయితే ప్రస్తుతం 2024 నాటికి దాదాపు రూ.75,000 స్థాయికి చేరుకుంది. దీర్ఘకాలంలో పెట్టుబడిదారులు దాదాపు 9 శాతం సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు (CAGR) పొందారు. మరో పక్క స్టాక్ మార్కెట్ల రాబడులను గమనిస్తే.. 1979లో 100 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ సూచీ 2024 నాటికి దాదాపు 82000 పాయింట్లకు పెరిగింది. అంటే సగటున స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు 16 శాతం రాబడులను అందుకున్నారు.
అయితే ఇక్కడ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడులకు, పసిడిలో పెట్టుబడులకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు ప్రపంచ వ్యాప్తంగా అనేక కారకాల వల్ల ప్రభావితం అవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది సేఫ్ హెవెన్ అయిన పసిడిలోకి తమ పెట్టుబడులను మారుస్తుంటారు. ఆర్థిక అనిశ్చితులు ఉన్న సమయంలో సైతం బంగారానికి పెట్టుబడిదారులు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంటారు. అది విలువను కాపాడటంలో అత్యుత్తమమైన పెట్టుబడిగా అనేక దశాబ్ధాలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.


Click it and Unblock the Notifications