G20 Summit: 2030 కోసం రెండు కీలక నిర్ణయాలు.. విద్యుత్, డిజిటల్ లిటరసీపై ఫోకస్..
G20 Summit: దిల్లీ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో మెుదటి రోజున కొన్ని కీలకమైన నిర్ణయాలను సభ్యదేశాలు అంగీకరించాయి. ఈ క్రమంలో 2030 నాటికి చేరుకోవటానికి కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాయి.
మెుదటి రోజున జరిగిన G20 లీడర్స్ సమ్మిట్, 2030 నాటికి డిజిటల్ లింగ వ్యత్యాసాన్ని సగానికి తగ్గించాలని నిర్ణయించింది. అలాగే మహిళల నేతృత్వంలోని అభివృద్ధి యొక్క పరివర్తన శక్తిపై దృష్టి సారించింది. ఇందుకోసం డిజిటల్ టెక్నాలజీల ప్రాప్యత, స్వీకరణకు ఉన్న అడ్డంకులను పరిష్కరించాలని డిక్లరేషన్ పేర్కొంది. G20 మహిళా మంత్రివర్గానికి మద్దతు ఇవ్వడానికి మహిళల సాధికారతపై కొత్త వర్కింగ్ గ్రూప్‌ను రూపొందించడానికి G20 నాయకులు అంగీకరించారు.

పెరిగిన డిజిటలీకరణ, దీనివల్ల మహిళలు బాలికలు ఎదుర్కొనే ప్రమాదాలను గుర్తించటం, వాటిని తొలగించడానికి G20 నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారని డిక్లరేషన్ తెలిపింది. ఇదే క్రమంలో గ్రీన్ ఎనర్జీ ఆవశ్యకత, భవిష్యత్తు ఇంధన అవసరాల గురించి దిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సులో ప్రధానంగా చర్చించారు నాయకులు.
రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాలను 2030 నాటికి మూడింతలు చేయాలని నాయకులు అంగీకరించారు. అలాగే దశాబ్ధం మధ్య నాటికి అంటే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉద్ఘారాలను సున్నా స్థాయికి తీసుకురావాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన, స్థిరమైన, న్యాయమైన, సరసమైన, సమ్మిళిత శక్తి పరివర్తనలను అమలు చేయడం వంటి బహుముఖ విధానం ద్వారా స్థిరమైన భవిష్యత్తు కోసం 'గ్రీన్ డెవలప్‌మెంట్ ప్యాక్ట్' అనే అధ్యాయాన్ని డిక్లరేషన్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications