Tech Stocks: ఇటీవల వరుసగా దేశీయ టెక్ కంపెనీలు తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. ఈ క్రమంలో టీసీఎస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా కంపెనీలపై బెట్టింగ్ వేయాలనుకుంటున్న ఇన్వెస్టర్లు గందరగోళంలో ఉన్నారు.
ఏ టెక్ కంపెనీని వాల్యూ పిక్ కింద పెట్టుబడికి ఎంచుకోవాలనే విషయంలో వారు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మార్చి త్రైమాసిక ఫలితాలను గమనిస్తే.. టీసీఎస్ ఫలితాలు విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్ లను అధిగమించి అత్యుత్తమ పనితీరును కనబరిచినట్లు నిపుణులు వెల్లడించారు. దీర్ఘకాలంలో పరిశీలిస్తే ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకున్న హెచ్‌సిఎల్ టెక్ షేర్లను ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి కోసం ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. అలాగే క్యూ4లో విప్రో నికర లాభం గత ఏడాదితో పోల్చితే 8 శాతం క్షీణించి ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా టెక్ స్పెండింగ్ తీరుతెన్నులను పరిశీలిస్తే.. కంపెనీలు ఎక్కువగా ఏఐ ఉత్పత్తుల వినియోగం వైపు మెుగ్గుచూపుతున్నాయి. దీంతో ఐటీ కంపెనీలు సైతం ఏఐ సాంకేతికపై దృష్టి సారిస్తూ దానిని తమకు ఆదాయవనరుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న వ్యాపార వాతావరణంలో లాభదాయకతను పెంచుకోవాలంటే దేశీయ ఐటీ సేవల కంపెనీలు టెక్నాలజీ సర్వీసులతో పాటు ఏఐ ఉత్పత్తులను అందించాల్సి ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. రానున్న వ్యాపార రేసులో ఏఐపై పట్టు సాధించిన దేశీయ టెక్ కంపెనీలు మాత్రమే విజయం సాధించగలవని వారు చెబుతున్నారు.
సోమవారం ఏ ఐటీ స్టాక్ కొనొచ్చు..?
నాలుగు టెక్ దిగ్గజ కంపెనీల టెక్నికల్ ప్యాట్రన్లను పరిశీలిస్తే.. టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల షేర్లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం కలిగిన పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిలో బలమైన పనితీరును కనబరిచిన ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లను ఎంచుకోవటం ఉత్తమ నిర్ణయంగా నిపుణులు సూచిస్తున్నాయి. స్వల్ప కాలంలో కంపెనీ షేర్లు కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వారు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో ఇన్ఫోసిస్ స్టాక్ ధర రూ.1900 స్థాయికి చేరుకోవచ్చని వెల్లడించారు. దీని తర్వాత రెండవ స్టాక్ ఎంపికగా విప్రోను పరిగణించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ దీర్ఘకాలంలో రూ.615 స్థాయికి చేరుకునే బలాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. మూడో ఎంపికగా టీసీఎస్ టార్గెట్ ధర రూ.4750, చివరి ఎంపికగా ఉన్న హెచ్‌సిఎల్ టెక్ రూ.1250 చేరుకోవచ్చంది. అయిదే దీనిని డిప్స్ వద్ద కొనుగోలు చేయొచ్చని వారు సూచిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications