Know Fact: ఫాస్టాగ్ చెల్లింపులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. కారు గ్లాస్ క్లీన్ చేస్తూ ఓ పిల్లవాడు తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ఉపయోగించి కారు అద్దానికి అమర్చిన ఫాస్ట్ ట్యాగ్‌ని స్కాన్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఆ పిల్లవాడు అక్కడి నుంచి పారిపోవటం వీడియోలో గమనించవచ్చు. ఈ విధంగా ఫాస్టాగ్‌లో డబ్బులు తస్కరిస్తున్నట్లు వీడియో తీసిన వ్యక్తి ఆరోపించారు. అసలు ఇది నిజంగానే జరిగితే పెద్ద లోపమనే చెప్పుకోవాలి. ఈ వీడియో చూసిన వారు ఫాస్ట్‌ట్యాగ్ విశ్వసనీయతపై అనుమానాలకు గురవుతున్నారు. అసలు ఇలా నిజంగా చేయటం సాధ్యమేనా, వీటిలో వాస్తవం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ వీడియో వెనుక కథ..
వీడియోలో కనిపిస్తున్న పిల్లాడి చేతికి ఉన్న వాచ్‌తో ఫాస్ట్‌ట్యాగ్‌ని స్కాన్ చేసినట్లు వీడియోలో క్లెయిమ్ చేస్తున్నప్పటికీ.. ఆలా చేయటం సాధ్యం కాదు. మొదటి విషయం ఏమిటంటే.. మీ ఫాస్ట్‌ట్యాగ్‌ని ఏ వ్యక్తీ కూడా స్కాన్ చేయలేరు. ప్రభుత్వం అనుమతించిన ఖాతాల ద్వారా మాత్రమే ఫాస్ట్‌ట్యాగ్ నుంచి డబ్బు డిడక్ట్ చేయబడుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ గురించి తప్పుడు సమాచారం ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ప్రభుత్వం తెలుసుకున్న వెంటనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వీడియోను విడుదల చేసింది. వీడియో పూర్తిగా ఫేక్ అని పీఐబీ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. ప్రతి టోల్ ప్లాజాకు ప్రత్యేకమైన కోడ్ ఉంటుందని, వీడియోలో క్లెయిమ్ చేసినట్లుగా లావాదేవీ సాధ్యం కాదని PIB వివరణ ఇచ్చింది.
Paytm ఏమందంటే..
NETC మార్గదర్శకాల ప్రకారం.. ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా అలాంటి లావాదేవీలేమీ చేయలేమని Paytm తెలిపింది. ఆథరైజ్డ్ వ్యాపారులు మాత్రమే దీన్ని చేయగలరని వెల్లడించింది. తమ ఫాస్ట్ ట్యాగ్ పూర్తిగా సురక్షితమని పేటీఎం పేర్కొంది. మీ FASTag నుంచి డబ్బును ఎవరు తీసివేయగలరు? ట్విట్టర్‌లో ఒక వ్యక్తికి ప్రతిస్పందిస్తూ.. FASTag NETC ట్విట్టర్ హ్యాండిల్‌కు NETC ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు రిజిస్టర్డ్ వ్యాపారుల ద్వారా మాత్రమే చేయవచ్చని తెలిపింది. వీడియోలో చూపినట్లు జరగటం కుదరదని తెలిపింది.
నిజం తెలుసుకోండి..
ఇలాంటివి నిజంగానే జరుగుతుందేమోనని అస్సలు చింతించకండి. ఫాస్టాగ్‌ని అస్సలు అనుమానించకండి. మీ డబ్బు పూర్తిగా సురక్షితం, అధీకృత వ్యాపారి దాని నుంచి డబ్బును డిడక్ట్ చేసినప్పుడు మాత్రమే డబ్బు కట్ అవుతుంది. ప్రజలు ఏ వీడియోనైనా సోషల్ మీడియాలో పెట్టవచ్చు. కానీ.. దాని వెనుక నిజం తెలియకుండా మీరు నమ్మకూడదు. ఫాస్ట్‌ట్యాగ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన వ్యక్తిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాబట్టి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో అసలు నిజం ఎంత అనే విషయాన్ని తెలుసుకునే వాటిని నమ్మాలి.


Click it and Unblock the Notifications