Market Next Week: ఈ వారం మార్కెట్ల దారెటు.. ఇన్వెస్టర్స్ ఈ విషయాలపై దృష్టి పెట్టాల్సిందే..
Stock Markets: భారతీయ స్టాక్ మార్కెట్లు గతవారం ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే నష్టాలను మిగిల్చాయి. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు చర్య తర్వాత అమాంతం పెరుగుదలతో సరికొత్త జీవితకాల కరిష్టాలకు సూచీల ప్రయాణంతో కొనసాగిన బుల్ జోరు విరిగిపోయింది. దీంతో దలాల్ స్ట్రీట్ ఎరుపెక్కింది. ఈ క్రమంలో అప్రమత్తమంగా ఉన్న ఇన్వెస్టర్లు కొత్తవారంపై కోటి ఆశలతో ఉన్నారు. రానున్న వారంలో మార్కెట్ల పనితీరు ఎలాఉంటుందనే ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలపై ప్రతి ఒక్కరు ఓ లుక్కేయాల్సిందే..
ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ముఖ్యంగా మూడు విషయాలపై దృష్టి సారించాల్సి ఉంది. ఇందులో ముఖ్యమైనది ఆర్బీఐ బైమంత్లీ మానిటరీ పాలసీ సమావేశం కాగా రెండవది యూఎస్ ద్రవ్యోల్బణం డేటా విడుదల. ఇది మూడో అతిముఖ్యమైన అంశం కొనసాగుతున్న మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన తర్వాత జరగనున్న తొలి ఆర్బిఐ పాలసీ సమావేశం కావటంతో అందరి చూపు వడ్డీ రేట్ల తగ్గింపు ఎంత ఉంటుందనే అంశంపైనే ఉంది. గతంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపుకు అనుగుణంగా ఆర్బీఐ తన వడ్డీ రేట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లు తగ్గితే రుణ భారం చెల్లించాల్సిన ఈఎంఐలు తగ్గుతాయని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం అంచనాల ప్రకారం ఈసారి వడ్డీ రేట్లలో ఎలాంటి తగ్గింపులను మీటింగ్ ప్రకటించకపోవచ్చని తెలుస్తోంది.

ఇది అందరి చూపు ఉన్న రెండవ అంశం క్యూ2 కార్పొరేట్ ఫలితాలు. ఐటీ మేజర్ టీసీఎస్ తన ఫలితాలను ఈ వారం ప్రకటించనుందని తెలుస్తోంది. దీనికి తోడు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధవాతావరణం రోజురోజుకూ ఉద్రక్తతలను పెంచుతోంది. హిజ్బుల్లా, హమాస్‌లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని కొనసాగించడంతో మధ్యప్రాచ్యంలోని పరిస్థితిని మార్కెట్ భాగస్వాములు గమనిస్తారు. శనివారం చివరిలో బీరుట్ శివారు ప్రాంతాలపై తాజా వైమానిక దాడులతో లెబనాన్‌లో బాంబు దాడిని పెంచారు. ఇజ్రాయెల్‌పై ఇటీవల ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై గణనీయమైన దాడిని ప్రారంభిస్తే మార్కెట్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇది క్రూడ్ ధరలను మరింతగా పెంచవచ్చని వారు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు FOMC మినిట్స్, యూఎస్ ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు ఫెడ్ అధికారుల ప్రసంగాలను నిశితంగా గమనిస్తున్నారు. యూఎస్ ద్రవ్యోల్బణం వరుసగా ఐదవ నెలలో తగ్గుతూనే ఉంది. జూలైలో 2.9 శాతం నుంచి ఆగస్టులో 2.5 శాతానికి పడిపోయింది. దీనికి తోడు ఎఫ్ఐఐలు గతవారం తమ డబ్బును భారత మార్కెట్ల నుంచి భారీగా వెనక్కి తీసుకున్నారు. సెప్టెంబరులో చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 17 శాతానికి పైగా ఎగబాకగా, హాంగ్ కాంగ్ యొక్క హాంగ్ సెంగ్ ఆగస్టు నుండి 31 శాతం పెరిగింది. అక్టోబర్ 4తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు అక్టోబర్ 11న విడుదల కానున్నాయి. ఇదే సమయంలో మార్కెట్లోకి కొత్త వారంలో కూడా ఐపీవోల రద్దీ కొనసాగుతోంది. కొన్ని లిస్టింగ్స్ ఉండగా, మరికొన్న కొత్త ఐపీవోల ఓపెనింగ్ కొనసాగనుంది.


Click it and Unblock the Notifications