IT News: అమెరికా, యూరప్‌లో కొనసాగుతున్న ఆర్థిక మందగమనం మధ్య భారతీయ ఐటీ కంపెనీలు గత రెండేళ్లలో పనితీరు తక్కువగా ఉన్నాయి. జూన్ 2021 నుంచి టాప్ నాలుగు IT కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను కలిగించాయి. అలాగే బలహీనమైన రాబడులను నమోదు చేశాయి.
సాధారణంగా ఐటీ కంపెనీలు జూన్ తో ముగిసే త్రైమాసికంలో బలమైన రాబడులను అందిస్తుంటాయి. కానీ ఈ ఏడాది జూన్ ఇందుకు మినహాయింపుగా కనిపిస్తోంది. విప్రో, టెక్ మహీంద్రా, ఎంఫాసిస్ రాబడులు తగ్గుతాయని అంచనాలు ఉండగా.. టీసీఎస్ ప్లాట్ గా.. హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ స్వల్ప వృద్ధిని నమోదు చేయవచ్చని తెలుస్తోంది. ఫైనాన్స్, టెలికాం రంగాల్లో ప్రాజెక్టులు వెనక్కి వెళుతున్న తరుణంలో టెక్ కంపెనీల ఆదాయంపై ప్రభావం చూపుతుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్‌లోని విశ్లేషకులు తెలిపారు.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యాపార అవకాశాలపై ఆశాజనకంగా ఉంది. ఈ క్రమంలో కొన్ని కంపెనీల షేర్లకు కొనుగోలు రేటింగ్ అందించగా.. మరికొన్ని ఐటీ కంపెనీల రేటింగ్ డౌన్ గ్రేడ్ చేసింది. కంపెనీలు పోటీ గట్టిగా ఉన్న కాస్ట్ ఆప్టిమైజేషన్ డీల్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ధరల ఒత్తిడి, మార్జిన్ డైల్యూషన్ చూడవచ్చని తెలుస్తోంది.
మార్కెట్ అనలిస్టుల ప్రకారం.. ఐటీ కంపెనీలపై సిఫార్లు గమనిస్తే..
Infosys (BUY)
Target Price: Rs 1,641.
TCS (BUY)
Target Price: Rs 3,786.
Persistent (BUY)
Target Price: Rs 5,960.
HCL Tech (ADD)
Target Price: Rs 1,291.
LTIMindtree (ADD)
Target Price: Rs 5,637.
Happiest Minds (ADD)
Target Price: Rs 1,038.
Mphasis (HOLD)
Target Price: Rs 1,812.
Wipro (REDUCE)
Target Price: Rs 350.
Tech Mahindra (SELL)
Target Price: Rs 927.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications