Mutual Funds: క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు కొనసాగించాలా? ఎగ్జిట్ అవ్వాలా?

Quant Mutual Funds: దేశంలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. లక్షలాది మంది చిన్న పెట్టుబడిదారుల రాకతో కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లలోకి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో తక్కువ కాలంలోనే ప్రాచుర్యం పొందిన క్వాంట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ నుంచి దర్యాప్తును ఎదుర్కొంటోంది. ఇటీవల కంపెనీ ఆఫీసుల్లో ఫంట్ రన్నింగ్ ఆరోపణల మధ్య జరిగిన సెర్చ్ అండ్ సీజర్ సోదాలు పెట్టుబడిదారులను ఒకింత ఉద్వేగానికి గురిచేస్తున్నాయి. తక్కువ కాలంలో ప్రజాధరణ పొందిన ఫండ్ హౌస్ ప్రస్తుతం రూ.93,000 కోట్ల ఆస్తులను నిర్వహిస్తూ అగ్ర మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది.

Know experts opinion over SIP investments in Quant Mutual Funds

మార్కెట్లో ఫంట్ రన్నింగ్ వంటి తప్పుడు ట్రేడింగ్ పద్ధలు ఫాలో అవ్వటం సాధారణ పెట్టుబడిదారులకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ఆరోపణలపై దర్యాప్తు జరుగుతుండగా.. మోసం జరిగిందా లేదా అనే విషయాన్ని సెబీ తేల్చాల్సి ఉంటుంది. వీటి మధ్య పెట్టుబడిదారులు తమ ఎస్ఐపీ పెట్టుబడులను క్వాంట్ ఫండ్ హౌస్‌లో కొనసాగించాలా వద్దా అనే అనుమానాలు చాలా మంది ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. దీనిపై నిపుణులను సంప్రదించగా పెట్టుబడిదారులు తమ ఎస్ఐపీలను కొనసాగించాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఇప్పటికే ఉన్న పెట్టుబడులను కొనసాగించవచ్చని చెబుతున్నారు.

ఇదే విషయంపై సెబీ రిజిస్టర్డ్ అన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గౌరవ్ గోయల్ ప్రకారం క్వాంట్ ఫండ్ హౌస్ ద్వార్ ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడిదారులను తమ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఉంచమని సలహా ఇచ్చారు. ఫండ్‌ల పనితీరుపై తాము ఎటువంటి పెద్ద ప్రభావాన్ని చూడలేదని పేర్కొన్నారు. పూర్తి స్పష్టత వచ్చే వరకు ఫండ్స్ నుంచి డబ్బు విత్ డ్రా నివారించాలని సూచించారు. పెట్టుబడిదారులు తమ ఎస్ఐపీలతో పాటు ఏకకాల పెట్టుబడులను కొనసాగించాలని అన్నారు. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని తాము రెగ్యులేటర్ పై పూర్తి నమ్మకంలో ఉన్నట్లు చెబుతూ స్కీమ్స్ పెట్టుబడిపెట్టిన స్టాక్‌లపై ఎటువంటి పెద్ద ప్రతికూల ప్రభావాన్ని ఊహించటం లేదని వెల్లడించారు.

సందీప్ టాండన్ 2017లో స్థాపించిన క్వాంట్ మ్యూచువల్ ఫండ్ భారీ ప్రజాధరణను అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ వద్ద నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ మార్చి 2020లో రూ.233 కోట్ల స్థాయి నుంచి ప్రస్తుతం రూ.80,030 కోట్లకు ఎగబాకాయి. టాండన్ ఆర్థిక సేవల రంగంలో 25 సంవత్సరాలకు పైగా అనుభవాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం క్వాంట్ మ్యూచువల్ ఫండ్‌లోని 22 స్కీమ్స్‌కు సంబంధించిన పెట్టుబడి నిర్ణయాలను పర్యవేక్షిస్తూ సంస్థను విజయం, వృద్ధి వైపు నడపటంలో టాండన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+