Investment Ideas: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ర్యాలీతో పాటు భారీ కరెక్షన్ సైతం ఏకకాలంలో చూశాయి. అయితే దీనిని కొందరు స్వల్పకాలికమైనదిగా భావిస్తుండగా.. మరికొందరు మాత్రం జాగ్రత్త పడాల్సిన సమయంగా పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో డిసెంబర్ 26న బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా మూడో సెషన్ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 230 పాయింట్లు లేదా 0.32 శాతం పెరిగి 71,337 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లు లేదా 0.43 శాతం లాభపడి 21,441 వద్ద ముగిసింది. ఈ క్రమంలో మెుత్తం మార్కెట్లో లిస్టెడ్ షేర్లలో దాదాపు 2,232 షేర్లు లాభపడగా.. 1508 కంపెనీల షేర్లు క్షీణతకు గురయ్యాయి. కేవలం 139 కంపెనీల షేర్లలో మాత్రం ఎలాంటి మార్పు నమోదుకాలేదు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పీఎస్‌యూ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు ఎనర్జీ, మెటల్, ఫార్మా 1 శాతానికి పైగా లాభపడడంతో గ్రీన్‌లో ముగిశాయి. సానుకూల ధోరణిని అంచనా వేస్తూ నిఫ్టీ ఇటీవలి లాభదాయకంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో SAS ఆన్‌లైన్ వ్యవస్థాపకుడు శ్రేయ్ జైన్ మార్కెట్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్లలో డిప్స్ వద్ద మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెంచుకోవటం, కొత్త కొనుగోళ్లు చేయటం ఉత్తమైనదిగా సూచించారు.
2024లో దూకుడుగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతలను ఊహించి గ్లోబల్ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. గ్లోబల్ రిస్క్-ఆన్ మధ్య ఎఫ్‌ఐఐల ఇన్‌ఫ్లోలు రివర్స్ అయినందున ప్రీమియం వాల్యుయేషన్‌లు ఉన్నప్పటికీ భారతీయ ఈక్విటీలు కూడా పెరుగుదలను ఎదుర్కొంటున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. గత 2 నెలలుగా కొనసాగిన ర్యాలీ తర్వాత మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల పరుగులో కొంత అలసట కనిపిస్తోందని నాయర్ అభిప్రాయపడ్డారు. 2024 సెక్టోరల్ రొటేషన్ పీరియడ్‌గా ఉంటుందని అంచనా వేయబడింది. ఈ క్రమంలో కన్జూమర్, ఐటీ, ఫార్మా, ఎక్స్ పోర్ట్ ఆధారిక కంపెనీల షేర్లు మెరుగైన పనితీరును కనబరుస్తాయని అంచనా వేశారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications