Stocks for June 4th: దేశంలో లోక్‌సభ ఎన్నికలు 5న దశ ముగిసిన వేళ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్ల చూపు ఎన్నికల ఫలితాలు, బీజేపీకి రాబోయే సీట్లపైనే ఉంది. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందా లేక కాంగ్రెస్ కూటమి అధికారం హస్తగతం చేసుకుంటుందా అనే దాని ఆధారంగా బెట్టింగ్ చేయాల్సిన స్టాక్స్ మారిపోతున్నాయి. అయితే దేశంలో నమోదవుతున్న ఎన్నికల సరళితో కొంత అనిశ్చితి మాత్రం కొనసాగుతూనే ఉంది.
జూన్ 4న వెల్లడికానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు ఇండియా VIX భయాందోళనలు కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్ ఆలస్యంగా స్థిరపడింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మార్కెట్ ఆందోళనలను కాస్త తగ్గించాయి. ఈ క్రమంలో విశ్లేషకుల అంచనాల ప్రకారం.. నిఫ్టీ రాబోయే వారాల్లో కొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకోవచ్చని ఊహిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమెుబైల్ రంగాల షేర్లకు ఎక్కువ సానుకూలత ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.

నాలుగు దశల ఎన్నికల సమయంలో నిఫ్టీ సూచీ 6 శాతం కరెక్షన్ నమోదు చేసింది. ఈ సమయంలో ఈసారి ఎన్నికల ఫలితాల చుట్టూ జరిగిన అంచనాలతో మార్కెట్లు 3 సార్లు కొత్త గరిష్ఠాలను తాకినట్లు ఐసీఐసీఐడైరెక్ట్ తెలిపింది. జీవిత గరిష్ఠ స్థాయిల నుంచి 4.5 శాతం సరిదిద్దిన తర్వాత ఇండెక్స్ పుంజుకుంది. ప్రస్తుత దశలో 70 శాతానికి పైగా నిఫ్టీ భాగాలు మరింత పురోగమనాన్ని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీలోని బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ & గ్యాస్, పవర్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు బులిష్ మెుమెంటం కలిగి ఉండనున్నట్లు అంటనా.
శుక్రవారం ఎఫ్‌పీఐలు కొనుగోలుదారులుగా మారటంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలను నిలిపివేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఎన్డీటీపీతో చర్చా సమయంలో ప్రధాని మోదీ ఇన్వెస్టర్లకు భరోసా కలిగించే ప్రయత్నం చేస్తూ.. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలైన తర్వాత మార్కెట్‌లో పదునైన ర్యాలీ ఉంటుందని అన్నారు. మార్కెట్ స్మార్ట్‌గా ఉన్నందున ఎన్నికల ఫలితాలకు ముందే మార్కెట్ ముందుకు సాగే అవకాశం ఉంది. ఫలితాలను అంచనా వేయడానికి సరిపోతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన వికె విజయ్‌కుమార్ అన్నారు.
బ్యాంకులు, ద్విచక్ర వాహనాల తయారీదారులు, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు క్యూ4 ఫలితాలతో ప్రస్తుతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయని విజయ్‌కుమార్ చెప్పారు. ఇదే క్రమంలో ముఖ్యమైన రాజకీయ సంఘటన తర్వాత మార్కెట్ పెద్ద ఎత్తుగడకు సిద్ధమవుతోందని HDFC సెక్యూరిటీస్ భావిస్తోంది. ప్రధాన గ్లోబల్ సూచీలు జీవిత గరిష్ఠ స్థాయిల్లో ఉన్నప్పటికీ దేశీయ ఈక్విటీ మార్కెట్లు వాటిని ఫాలో అవటం లేదని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. అయితే జనరల్ ఎలక్షన్స్ హడావిడి తర్వాత బలమైన ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్లు దేశీయ మార్కెట్లకు దిశానిర్థేశం చేస్తాయని బ్రోకరేజ్ అంచనా వేసింది.
ఎన్‌డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తే.. విధానాల కొనసాగింపుతో మౌలిక సదుపాయాలు, రక్షణ, మూలధన వస్తువులు, న్యూ ఎనర్జీ, పర్యాటకం మొదలైన అంశాలకు సంబంధించిన అంశాలు బాగా కొనసాగుతాయని తెలుస్తోంది. అలాగే కన్జూమర్, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ విక్రయ కంపెనీల షేర్లకు గ్రామీణ డిమాండ్ పెరుగుదల, సాధారణ రుతుపనాలు పెరుగుదలకు దోహదంగా నిలుస్తాయని వెల్లడైంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications