IPO News: హ్యుందాయ్ మెగా ఐపీవో కోసం చూస్తున్నారా.. ప్రైస్ బ్యాండ్ ఎంతో తెలుసుకోండి
Hyundai IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వరుసగా ఐపీవోలు క్యూ కడుతున్న వేళ ఇదే దారిలో ప్రముఖ ఆటో మేకింగ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా సైతం నిలిచింది. దేశంలోని అతిపెద్ద ఐపీవోను మార్కెట్లలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో రాబోతోందన్న చర్చ ఊపందుకోగానే ఇన్వెస్టర్ల మదిలో తాము కూడా అందులో పాల్గొనాలనే ఆలోచన మెుదలైంది. అయితే ఇక్కడ కంపెనీ విలువ ఎంత అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ క్రమంలో కంపెనీ ఐరీవో ప్రైస్ బ్యాండ్ ధర ఒక్కో షేరుకు రూ.1265 నుంచి రూ.1988 మధ్య ఉండొచ్చని కొన్ని నివేదికల ప్రకారం తెలుస్తోంది. తాజా ఐపీవో ద్వారా భారత స్టాక్ మార్కెట్ల నుంచి కంపెనీ 3.5 బిలియన్ డాలర్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2024 జనవరి నుంచి జూన్ వరకు దేశంలో 2,72,207 యూనిట్లను విక్రయించడంలో హ్యుందాయ్ విజయం సాధించిందని వెల్లడైంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ అమ్మకాలు 2,66,760 యూనిట్లుగా ఉన్నాయి. అంటే వార్షిక ప్రాతిపదికన కంపెనీ విక్రయాల్లో 2 శాతం పెరుగుదల నమోదైంది. అలాగే FADA నివేదిక ప్రకారం భారతీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో కంపెనీ వాటా 13.80 శాతంగా ఉంది. దేశంలో మారుతీ సుజుకీ తర్వాత కంపెనీ రెండో స్థానంలో విక్రయాల్లో కొనసాగుతోంది.
FY 2009 నుంచి హ్యుందాయ్ మోటార్ ఇండియా భారతదేశంలోని ప్యాసింజర్ వాహన పరిశ్రమలో ఒరిజినల్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న రెండవ కంపెనీ. ఆర్థిక సంవత్సరం 2005-2022 వరకు ప్యాసింజర్ వాహన విభాగంలో దేశం నుంచి అతిపెద్ద ఎగుమతిదారుగా కంపెనీ నిరూపించబడింది. ప్రస్తుత ఐపీవో ద్వారా ప్రమోటర్లు కంపెనీలో తమ వాటాను 17.50 శాతం తగ్గించుకోవచ్చని ఇన్‌క్రెడ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. అలాగే నిఫ్టీ ఆటో ఇండెక్స్ పనితీరు చాలా అద్భుతంగా ఉందని పేర్కొంది. గత ఏడాది కాలంలో నిఫ్టీ ఆటో ఇండెక్స్ 68 శాతం పెరిగింది. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో దేశీయ ఇన్వెస్టర్లు ఐపీవో లాంచ్ కాగానే షేర్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications