Muhurat Trading: బ్రోకరేజ్ ఎంపిక చేసిన స్టాక్ తారా జువ్వలు.. దీపావళి స్టాక్ పిక్స్.. మీ దగ్గర ఉన్నాయా
Samvat 2079: దీపావళిని ఇన్వెస్టర్లు, వ్యాపారులు ఒక శుభ సందర్భం గా భావిస్తారు. వేలాది మంది తమ పెట్టుబడులు ఆరోగ్యకరమైన రాబడిని అందిస్తాయనే ఆశతో తమకు ఇష్టమైన స్టాక్‌లలో పెట్టుబడులు పెడుతుంటారు. ఇందుకోసం దివాలీ రోజు కొద్ది సేపు మాత్రమే ట్రేడింగ్ నిర్వహించటం ఒక ఆనవాయితీగా వస్తోంది.

బ్రోకరేజ్ ఎంపికలు..
బ్రోకరేజ్ సంస్థ ఎడెల్వీస్ దీపావళి కోసం 11 స్టాక్స్ ఎంపిక చేసింది. ఇందుకోసం బలమైన ఫండమెంటల్స్ కలిగిన కంపెనీలను ఎంపిక చేసింది. ఈ స్టాక్స్ మీడియం నుంచి లాంగ్ టర్మ్ లో వృద్ధికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.

ఎడెల్వీస్ టాప్-11 స్టాక్ పిక్స్..
యాక్సిస్ బ్యాంక్, బాలాజీ అమీన్స్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజ్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, ఎలెకాన్ ఇంజనీరింగ్ కంపెనీ, ICICI బ్యాంక్, మాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్, MTAR టెక్నాలజీస్, నీలమణి ఫుడ్స్ ఇండియా, SJS ఎంటర్‌ప్రైజెస్, ట్రెంట్ కంపెనీల షేర్లను ఎంచుకుంది.

5పైసా టెక్నికల్ పిక్స్..
మొబైల్ అండ్ టవర్ క్రేన్‌ల విభాగంలో వ్యాపారం నిర్వహిస్తున్న ACE కంపెనీ (Buy Zone 292-306), ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా ఉన్న Coal India (Buy Zone 241-253), దేశంలోని దిగ్గజ ప్రైవేట్ రిటైల్ బ్యాంకింగ్ దిగ్గజ ICICI Bank (Buy Zone 867-910), దేశంలోని లాజిస్టిక్స్ పరిశ్రమలో 15% మార్కెట్ వాటా కలిగి ఉన్న TCI (Buy Zone 804-844), భారతీయ పాదరక్షలు & ఉపకరణాల ప్రత్యేక రిటైలర్ మెట్రో బ్రాండ్(Buy Zone 940-987) షేర్లను బ్రోకరేజ్ సంస్థ దీపావళి- 2022 కోసం ఎంపిక చేసుకుంది.
Note: పైన బ్రోకరేజ్ కంపెనీలు సూచించిన స్టాక్స్ కేవలం అవగాహన, సమాచారం కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ చేయకండి. స్టాక్ మార్కెట్లోలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ముందుగా మీ ఫైనాన్సియల్ అడ్వైజర్ సలహాలను తీసుకోండి.


Click it and Unblock the Notifications