Stock Picks: గ్లోబల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా భారత మార్కెట్ పట్ల ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్న నడుమ దీపావళి 2023 వచ్చింది. ఈ క్రమంలో బ్రోకరేజీలు కొన్ని షేర్లను కొనుగోలుకు అనువైనవిగా ఇన్వెస్టర్లకు సూచిస్తున్నాయి.
రెలిగేర్ బ్రోకింగ్ దీపావళి స్టాక్ పిక్స్:
1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్: టార్గెట్ ధర: రూ. 4,089; వృద్ధి అంచనా: 20.9 శాతం
2. ITC: టార్గెట్ ధర: రూ. 535; వృద్ధి అంచనా: 22.4 శాతం
3. యాక్సిస్ బ్యాంక్: టార్గెట్ ధర: రూ. 1,167; వృద్ధి అంచనా: 14.2 శాతం
4. మారుతీ సుజుకి ఇండియా: టార్గెట్ ధర: రూ. 12,714; వృద్ధి అంచనా:23.2 శాతం
5. SBI లైఫ్ ఇన్సూరెన్స్: టార్గెట్ ధర: రూ. 1,644; వృద్ధి అంచనా: 22.2 శాతం

మోతీలాల్ ఓస్వాల్ దీపావళి స్టాక్ పిక్స్:
దేశీయ స్టాక్ బ్రోకింగ్ దిగ్గజం మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్టర్లకు తన దీపావళి మార్కెట్ అంచనాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం సంవత్ 2080 కూడా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించే ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు వడ్డీ రేట్లపై నిర్ణయాలు, ఇజ్రాయెల్ యుద్ధం వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించినట్లు బ్రోకరేజ్ వెల్లడించింది.
సంవత్ 2080 కోసం మోతీలాల్ స్టాక్ సూచనలు..
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ప్రస్తుత ధర రూ.574 , టార్గెట్ ధర రూ.700
2. టైటాన్ స్టాక్: ప్రస్తుత ధర రూ.3,270 , టార్గెట్ ధర రూ.3,900
3. సిప్లా: ప్రస్తుత ధర రూ.1,203 , టార్గెట్ ధర రూ.1,450
4. మహీంద్రా అండ్ మహీంద్రా: ప్రస్తుత ధర రూ.1,492 , టార్గెట్ ధర రూ.1,770
5. తాజ్ హోటల్స్: ప్రస్తుత ధర రూ.395 , టార్గెట్ ధర రూ.480
ఇదే క్రమంలో కోటక్ సెక్యూరిటీస్ కెనరా బ్యాంక్, రిలయన్స్ ఇండస్టీస్, సిప్లా కంపెనీ షేర్లపై తన సానుకూలతను వ్యక్తం చేసింది.
1. కెనరా బ్యాంక్: ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 384, టార్గెట్ ధర: రూ. 425
2. రిలయన్స్ ఇండస్ట్రీస్: ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 2,288, టార్గెట్ ధర: రూ. 2,725
3. సిప్లా: ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 1,200, టార్గెట్ ధర: రూ. 1,320


Click it and Unblock the Notifications