Muhurat Trading: సాయంత్రమే ముహురత్ ట్రేడింగ్.. ఈ స్టాక్స్ మిస్ కాకండి..
Muhurat Trading: దీపావళి రోజు కేవలం గంటపాటు స్టాక్ మార్కెట్లు పెట్టుబడుల కోసం తెరవటం జరుగుతుంది. దీని వెనుక ఒక సిద్ధాంత ఉంది. ముందుగా దీనిని బీఎస్ఈ దేశంలో ప్రారంభించింది. దీనికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజు ఎందుకిలా..
హిందూ పురాణాల ప్రకారం ఏదైనా కొత్త లేదా మంచి ప్రారంభించడానికి ముహురత్ ను శుభప్రదంగా పరిగణిస్తారు. అందువల్ల.. కొత్త 'సంవత్' ప్రారంభంలో వ్యాపార సంఘాలు వారి ఖాతా పుస్తకాలను తెరుస్తాయి. అంటే వారి దృష్టిలో కొత్త ఫైనాన్సియల్ ఇయర్ దీపావళితో ప్రారంభమవుతుంది. లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి.. ఆమె ఆశీస్సులతో తమ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లటం ప్రత్యేకం. అందుకే BSE ముహురత్ ట్రేడింగ్ 1957లో ప్రారంభించగా.. మరో స్టాక్ ఎక్స్ఛేంజ్ NSE దీనిని 1992లో ప్రారంభించింది.

లాభాల పంట..
సాధారణంగా ముహురత్ ట్రేడింగ్ సమయంలో మార్కెట్ బులిష్ మెుమెంటంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు సాయంత్రం 6.15 గంటల నుంచి 7.15 గంటల వరకు ఈ స్పెషల్ ట్రేడింగ్ నిర్వహించబడుతుంది. ఈ సమయంలో చాలా మంది ఎంతో కొంత పెట్టుబడి పెట్టడం లేదా ఏదైనా కొత్త స్టాక్స్ కొనుగోలు చేయటం వంటివి చేస్తుంటారు.

IIFL బ్రోకరేజ్ స్టాక్స్..
లార్జ్ క్యాప్ సెగ్మెంట్ కింద బ్రోకరేజ్ సంస్థ టాప్-5 స్టాక్స్ ఎంపికను ప్రకటించింది. బ్రోకరేజ్ ఎంపిక కింద ఐసీఐసీఐ బ్యాంక్ కొనుగోలుకు టార్గెట్ ప్రైస్ రూ.980గా నిర్ణయించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ టార్గెట్ ధర రూ.620 గా అంచనా వేస్తూ BUY రేటింగ్ ఇచ్చింది. మెడికల్ స్టాక్ సిప్లా షేర్లను రూ.1,265 టార్గెట్ ధరకు కొనుగోలు చేయాలని సూచించింది. బ్లూ చిప్ స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ రూ.2,800 టార్గెట్ ధరకు BUY రేటింగ్ ఇచ్చింది. చివరిగా ఈ క్యాటగిరీలో అశోక్ లేలాండ్ స్టాక్ ను రూ.176 టార్గెట్ రేటుకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

మిడ్ క్యాప్ టాప్-5 స్టాక్స్..
ఐఐఎఫ్ఎల్ బ్రోకరేజ్ మిడ్ క్యాప్ క్యాటగిరీలో మెుదటగా దీపక్ ఫెర్టిలైజర్స్ స్టాక్ రూ.1,090 టార్గెట్ ధరకు కొనుగోలు చేయవచ్చని సూచించింది. దీని తర్వాత దీపక్ నైట్రైట్ షేర్లకు రూ.2,570 టార్గెట్ రేటుకు BUY చేయాలంది. Aptus value Housing షేర్లను రూ.357 ధరకు కొనుగోలు చేయవచ్చని సూచించింది. జేబీ కెమికల్స్ షేర్లను రూ.2,380 ధరకు కొనుగోలు చేయమనగా.. చివరిగా పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లకు రూ.3,970 టార్గెట్ ధరగా సూచించింది.
NOTE: పైన అందించిన బ్రోకరేజ్ సూచనలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి గ్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి కాబట్టి ఆర్థిక నిపుణుల సలహాలను పాటించండి.


Click it and Unblock the Notifications