Global Health IPO: ప్రస్తుతం దేశంలో ఐపీవోల ప్రస్థానం నడుస్తోంది. గడచిన ఒక్క వారం రోజుల్లో ఏకంగా నాలుగు ఐపీవోలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఆరోగ్య రంగానికి చెందిన ప్రముఖ ఆసుపత్రుల చైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఐపీవో టాప్ పాయింట్స్..
* ఐపీవో నవంబర్ 3న ప్రారంభమై నవంబర్ 7న ముగుస్తుంది
* ఈ షేర్ ఫేస్ వ్యాల్యూ రూ.2 రెండుగా కంపెనీ నిర్ణయించింది
* షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.319 నుంచి రూ.336గా ఉంది
* ఒక్కో లాట్ కు 44 షేర్లు ఉంటాయి
* ప్రస్తుతం ఐపీవో ఇష్యూ పరిమాణం మెుత్తం రూ.2,205.57 కోట్లుగా ఉంది

ఆఫర్ ఫర్ సేల్..
తాజా ఐపీవో ద్వారా కేవలం రూ.500 కోట్లను మాత్రమే కంపెనీ రెయిజ్ చేస్తున్నప్పటికీ.. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా దాదాపు 5.08 కోట్ల ఈక్విటీ షేర్లను సంస్థ విక్రయిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.662 కోట్లను సమీకరిస్తోంది. ఐపీవో ద్వారా వస్తున్న ఆదాయాన్ని రుణ చెల్లింపుల కోసం కంపెనీ వినియోగించనుంది. జియోజిత్, ఆషికా రీసెర్చ్ తో పాటు మరిన్ని బ్రోకరేజ్ సంస్థలు సైతం ఈ ఐపీవో షేర్లను కొనుగోలు చేయమని రేటింగ్ ఇచ్చాయి.

కంపెనీ పూర్తి వివరాలు..
* మేదాంతా పేరిట గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ ఆస్పత్రులను నిర్వహిస్తోంది
* అనంత్ ఇన్వెస్ట్‌మెంట్స్, సునీల్ సచ్‌దేవ కొంత వాటాలను అమ్మనున్నారు
* గ్లోబల్ హెల్త్‌లో అనంత్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు 25.67 శాతం వాటా ఉంది
* సునీల్ సచ్‌దేవకు గ్లోబల్ హెల్త్‌లో 13.43 శాతం వాటా ఉంది
* ఐపీవో ద్వారా మెుత్తం రూ.2,205.57 కోట్లను సమీకరిస్తున్నారు
* హాస్పిటల్స్ ను ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్ నరేశ్ ట్రెహాన్ 2004లో స్థాపించారు
* గురుగ్రామ్, ఇండోర్, రాంచీ, లఖ్‌నవూ, పట్నాలో హాస్పిటల్స్ ఉన్నాయి
* నోయిడాలో మరో ఆసుపత్రి నిర్మాణ దశలో ఉంది
* 2022 FYలో సంస్థ ఆదాయం రూ.2,205.8 కోట్లుగా నమోదైంది
* ఈ కాలంలో కంపెనీ లాభం రూ.196.2 కోట్లుగా ఉంది
* ఈ స్టాక్ BSE, NSE ఎక్స్ఛేంజీల్లో నవంబర్ 16న లిస్టింగ్ కానుంది

2025 నాటికి..
2025 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నోయిడాలో నిర్మిస్తున్న ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. దీంతో సంస్థ మెుత్తం ఇన్‌స్టాల్ చేయబడిన పడకల సంఖ్య 3,500 కంటే ఎక్కువకు చేరుకుంటుందని కంపెనీ వెల్లడించింది. తమ పెట్టుబడులు మెడికల్ టూరిజం వ్యూహంలో ఉపయోగపడతాయని అన్నారు. దీనివల్ల అంతర్జాతీయ రోజులు సైతం మన దేశానికి వచ్చి చికిత్స తీసుకునేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications