IPO News: రానున్న వారంలో కొత్తగా మార్కెట్లోకి ఒక ఐపీవో ప్రారంభం కానుంది. ఇదే క్రమంలో కొన్ని కంపెనీలు లిస్టింగ్ కి రెడీ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది Zaggle Prepaid Ocean Services Ltd గురించే. ఇది ఫిన్‌టెక్ రంగానికి చెందిన సంస్థ. ఈ కంపెనీ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సెప్టెంబర్ 14న ప్రారంభమై.. సెప్టెంబర్ 18న ముగియనుంది. ఇదే క్రమంలో యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ సెప్టెంబర్ 13న ప్రారంభమవుతుంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ.392 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించాలని నిర్ణయించింది.

ఆగస్టులో రెండు విడతలుగా ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్ నిర్వహించిన కంపెనీ పెట్టుబడిదారుల నుంచి రూ. 98 కోట్లను సేకరించింది. ఐపీవోలో 1.04 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంచబడ్డాయి. కంపెనీ ప్రమోటర్లు రాజ్ పి నారాయణం, అవినాష్ రమేష్ గోడ్ఖిండిలు తమ వాటాలను విక్రయిస్తున్నారు. ఇది కాకుండా వెంచర్ఈస్ట్ ప్రోయాక్టివ్ ఫండ్ LLC, GKFF వెంచర్స్, వెంచర్ఈస్ట్ SEDCO ప్రోయాక్టివ్ ఫండ్ LLC, వెంచర్‌ఈస్ట్ ట్రస్టీ కంపెనీ, జుజు సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, కోటేశ్వరరావు మేడూరి సైతం తమ వాటాలను విక్రయిస్తున్నారు.
కంపెనీ తన వ్యాపార ప్రస్థానాన్ని 2011లో స్థాపించటం ద్వారా మెుదలు పెట్టింది. ఇది బిజినెస్-టు-కస్టమర్ విభాగంలో పనిచేస్తుంది. ప్రీపెయిడ్ కార్డ్‌లు, ఉద్యోగుల నిర్వహణ ద్వారా ఖర్చు నిర్వహణ కోసం సంయుక్త పరిష్కారాన్ని అందిస్తూ దేశీయ మార్కెట్లో సముచిత స్థానాన్ని సృష్టించింది. తాజా ఐపీవో ద్వారా సమీకరించిన మెుత్తంలో రూ.300 కోట్లను కస్టమర్లను అక్వైర్ చేయటం వారిని నిలుపుకోవటానికి ఖర్చు చేయాలని నిర్ణయించింది. రూ.40 కోట్లను టెక్నాలజీ, ఉత్పత్తుల అభివృద్ధికి నిర్థేశించింది. అలాగే రూ.17.08 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగించనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications