Reliance Jio Unlimited 5G: 2024లో ముఖేష్ అంబానీ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో కొంత ఒడిదొడుకులను చూస్తోంది. ప్రధానంగా అనంత్ వివాహం తర్వాత టారిఫ్ రేట్ల పెంపుకు తీసుకున్న నిర్ణయం మంచి కంటే చెడే చేసింది. గడచిన నాలుగు నెలల్లో జియో ఏకంగా కోటి మందికి పైగా యూజర్లను కోల్పోవటంతో అంబానీ సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
రిలయన్స్ జియో తన వినియోగదారులకు మెరుగైన ఇంటర్నెట్ అందించేందుకు 4జీ నుంచి 5జీ కవరేజీని విస్తృత పరిచింది. ఈ క్రమంలో చాలా మంది మెరుగైన సేవల కారణంగా 5జీకి అప్‍గ్రేడ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ తన వినియోగదారులకు కొన్ని రీఛార్జ్ ప్లాన్లపై అపరిమిత 5జీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంచింది. దీనివల్ల డేటా అయిపోతుందనే చింత ఏమాత్రం లేకుండా నెట్ వినియోగించుకోవచ్చు. అయితే ఇందుకోసం ప్రతిరోజూ 2జీబీ ఇంటర్నెట్ ఉండే ప్లాన్ రీఛార్జ్ చేసుకోవటం తప్పనిసరనే విషయం తెలిసిందే. ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించాలని నిర్ణయించిన జియో అందరికీ 5జీని చేరువ చేసేందుకు కంపెనీ అపరిమిత 5జీ వోచర్ ప్లాన్‌ను ప్రారంభించింది.

ప్రస్తుతం కంపెనీ ప్రకటించిన అపరిమిత 5జీ డేటా వోచర్ రూ.601కి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కింద యూజర్లు 12 నెలల పాటు అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చు. పైగా వోచర్ ను యూజర్లు తమ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులకు బహుమతిగా అందించవచ్చు కూడా. జియో అందిస్తున్న ఈ గిఫ్ట్ వోచర్ ప్లాన్‍ను MyJio అప్లికేషన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అపరిమిత 5G వోచర్‌ను యాక్టివేట్ చేయడానికి, వినియోగదారులు రోజుకు 1.5-4 GB డేటాను అందించే ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని యాప్ ద్వారానే తమ ప్రియమైన వారికి గిఫ్ట్ చేయవచ్చు. కాకపోతే వోచర్‌ను బహుమతిగా ఇచ్చే ముందు గ్రహీత అర్హత గల ప్లాన్‌లో ఉన్నారని నిర్ధారించుకోవటం ముఖ్యం.
జియో ప్రస్తుతం ప్రకటించిన రూ.601 అనేది ఒక రకమైన అప్‌గ్రేడ్ వోచర్. ఇందులో 12 5జీ అప్‌గ్రేడ్ వోచర్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు My Jio యాప్‌కి వెళ్లడం ద్వారా దాన్ని రీడీమ్ చేసుకోవచ్చు. ఈ వోచర్‌ని యాక్టివేట్ చేయడానికి వినియోగదారులు 199, 239, 299, 319, 329, 579, 666, 769, 899 నుండి ఏదైనా రీఛార్జ్ ప్లాన్‌ని ముందుగా కలిగి ఉండాలి. అయితే రోజువారీ డేటా లిమిట్ 1జీబీ ఉన్న ప్లాన్ హోల్డర్లు మాత్రం వోచర్ రిడీమ్ చేసుకోవలేరు. అలాగే యూజర్లు రూ.1899 వార్షిక ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కూడా ప్రయోజనాలను అందుకోలేరని గుర్తుంచుకోవాలి. కొత్త వోచర్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత రోజూ 3జీబీ వరకు 4జీ డేటాతో పాటు అపరిమిత 5జీ డేటాను ఆస్వాధిస్తారు. ప్రతి వోచర్ చెల్లుబాటు 30 రోజులుగా ఉంటుంది.
దేశంలో డేటా వినియోగం నిరంతరం పెరుగుతున్న వేళ జియా దానికి అనుగుణంగా డేటా వోచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని వినియోగించుకోవటానికి యూజర్లు మై జియో యాప్ నుంచి వాటి కొనుగోలు చేసుకోవచ్చు. కంపెనీ రూ.601 ప్లాన్ తో పాటు 51, 101, 151 ప్లాన్లను కూడా అందుబాటులో ఉంచింది. వీటి రీఛార్జ్ ద్వారా యూజర్లు 1,2,3 నెలల కాలానికి అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చు. అలాగే కంపెనీ అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా ప్రజలు దీనిని పొందవచ్చని జియో వెల్లడించింది.


Click it and Unblock the Notifications