IPO News: యుద్ధం వల్ల ఏర్పడిన ఒడిదొడుకులతో దేశీయ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్లలో పరిణామాల మధ్య వచ్చేవారం మార్కెట్లోకి అనేక ఐపీవోలు క్యూ కడుతున్నాయి.
ఈ క్రమంలో ఐపీవోల్లో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు శుభవార్త. రాజ్‌గోర్ క్యాస్టర్ డెరివేటివ్స్ IPO రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం అక్టోబర్ 17, 2023న ప్రారంభం అవుతోంది. ఈ ఐపీవోలో కంపెనీ 88.95 లక్షల ఈక్విటీ షేర్లతో పాటు 6.66 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద జారీ చేస్తోంది. దీనికోసం కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.47 నుంచి రూ.50గా నిర్ణయించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.47.8 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది.

కంపెనీ లాట్ పరిమాణాన్ని 3000 షేర్లుగా నిర్ణయించింది. ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవోలో పాల్గొనాలంటే కనీసం ఒక లాట్ షేర్లను కొనుగోలు చేసేందుకు రూ.1,50,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. షేర్ల కేటాయింపు ఆగస్టు 27న జరగనున్న ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో షేర్ ధర రూ.60గా ఉంది. అంటే కంపెనీ విక్రయిస్తున్నదాని కంటే 20 శాతం ప్రీమియం రేటుతో ఉంది. స్టాక్ మార్కెట్లో రాజ్‌గోర్ క్యాస్టర్ డెరివేటివ్స్ షేర్లు 31 అక్టోబర్ 2023న లిస్టింగ్ కానున్నాయి.
కంపెనీ 2018లో స్థాపించబడింది. ఈ కంపెనీ భారత మార్కెట్ల కోసం ఆయిల్ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తుంది. కంపెనీ ఉత్పత్తి చేసే బ్లీచ్ చేయబడిన ఆముదం లూబ్రికెంట్స్, పెయింట్స్, ఫార్మాస్యూటికల్స్, కేబుల్ ఇన్సులేటర్స్, సీలెంట్స్, ఇంక్స్, రబ్బర్, టెక్స్‌టైల్స్ మొదలైన వాటిలో వినియోగిస్తారు. అలాగే మలబద్ధకం, వెంట్రుకలు పెరగడం, జుట్టు పెరగడం, స్కిన్ మాయిశ్చరైజర్ ప్రకటనను రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి వాడుతుంటారు.


Click it and Unblock the Notifications