IPO News: రేపే ప్రారంభమౌతున్న ఐపీవో.. ముందుగా ఈ 10 విషయాలు తెలుసుకోండి..
IPO News: మార్కెట్లో ఇన్వెస్టర్లకు అస్సలు గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాయి ఐపీవోలు. చిన్నదో పెద్దదో ప్రతివారం ఏదోఒక ఐపీవో అయితే మార్కెట్లోకి వస్తూనే ఉంది. అయితే రేపు ప్రారంభం కానున్న ఐపీవో గురించి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఈనెలలో మార్కెట్లోకి అడుగుపెట్టిన నాలుగో ఐపీవోగా పిరమిడ్ టెక్నోప్లాస్ట్ నిలిచింది. ఇది ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఐపీవో బిడ్డింగ్ కోసం ఆగస్టు 18న తెరవబడుతోంది. సబ్‌స్క్రిప్షన్‌కి చివరి రోజు ఆగస్ట్ 22గా కంపెనీ నిర్ణయించింది. అయితే యాంకర్ ఇన్వెస్టర్లకు మాత్రం ఇది ఆగస్టు 17న అంటే ఒక్కరోజు ముందుగానే తెరవబడుతోంది.

ఐపీవో కోసం షేర్ ధర ప్రైస్ బ్యాండ్ రూ.151-166గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ పాలిమర్ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తుంటుంది. కంపెనీ మెుత్తం 92.2 లక్షల ఈక్విటీ షేర్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అయితే ఇందులో 55 లక్షల షేర్లు ఫ్రెష్ ఇష్యూ ఉండగా.. మిగిలినవి ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఇన్వెస్టర్ల కోసం అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా ఇష్యూ చేస్తున్న షేర్ల ద్వారా వచ్చిన మూలధనాన్ని అప్పుల చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించాలని కంపెనీ నిర్ణయించింది.

ఐపీవోలో బిడ్డింగ్ కోసం ఒక్కో లాట్ లో 90 షేర్లు ఉంటాయి. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ కనీసం రూ.14,940 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కంపెనీ కెమికల్స్, ఆగ్రో కెమికల్స్, ఫార్మా కంపెనీలకు ప్యాకేజింగ్ మెటీరియల్ సప్లై చేస్తోంది. కంపెనీ ఆర్థిక పనితీరును గమనిస్తే.. మార్చితో ముగిసిన FY23లో కంపెనీ నికర లాభం రూ.31.76గా నిలిచింది. అలాగే కంపెనీ ఆదాయం రూ.480 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 25న షేర్ల కేటాయింపు, ఆగస్టు 29న ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి షేర్ల జమ జరిగిపోనుంది. చివరగా ఆగస్టు 30న కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్ట్ అవుతాయని వెల్లడైంది. గ్రేమార్కెట్ 10 శాతం ప్రీమియంతో షేర్లు ఉన్నట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications