PMMVY Scheme: ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన స్కీమ్ గురించే. మహిళలు దీనికి సంబంధించి ప్రయోజనాలను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
PMMVY స్కీమ్ గర్భవతులు, ప్రసవం సమయంలో తల్లులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, వారి పోషకాహార అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పథకం. ఇంతకుముందు ఈ పథకాన్ని "ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగ్ యోజన" అని పిలిచేవారు. స్కీమ్ కింద మొదటి బిడ్డతో గర్భవతి అయిన 19 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి మూడు వాయిదాల్లో రూ.5,000 పొందుతారు. గతంలో స్కీమ్ కింద పరిహారంగా రూ.6,000 అందించేవారు.

ఈ కార్యక్రమం భారతదేశంలోని గర్భిణీలు, పాలిచ్చే తల్లులందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దరఖాస్తుదారులు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు 3 వాయిదాల్లో ఫండ్ అందించబడుతుంది. ఈ సహాయం తల్లుల పోషక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్య సౌకర్యాల మెరుగుదలని ప్రోత్సహిస్తుంది. ఈ పథకాన్ని పొందేందుకు https://pmmvy.wcd.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి పౌర లాగిన్ ఎంపికపై క్లిక్ చేయండి. స్కీమ్ నమోదుకు ముందుగా మొబైల్ నంబర్‌ను నమోదు చేయగానే ఫారమ్ తెరవబడుతుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేని వారు. సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి కూడా పథకానికి నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు ధృవీకరించబడిన తర్వాత ఆర్థిక సహాయం మీ బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది.
ఈ పథకం కోసం అవసరమైన పత్రాలు:
గర్భిణీ స్త్రీ ఆధార్ కార్డు
పిల్లల జనన ధృవీకరణ పత్రం
చిరునామా సర్టిఫికేట్
ఆదాయ ధృవీకరణ పత్రం
కుల ధృవీకరణ పత్రం
పాన్ కార్డ్
కొనుగోలు ఖాతా పుస్తకం, మొబైల్ నెం
పాస్‌పోర్ట్ సైజు ఫోటో


Click it and Unblock the Notifications