For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Neuberg Diagnostics IPO: మార్కెట్లోకి న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ ఐపీవో.. ఇన్వెస్ట్ చేయాలా..?

|

Neuberg Diagnostics IPO: మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి మరో కంపెనీ ఐపీవో రూపంలో రాబోతోంది. న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దేశంలోనే కాక విదేశాలకు విస్తరించాలని చూస్తోంది. ఇందుకోసం రూ.1,500 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. హెల్త్‌కేర్ అనుభవజ్ఞుడైన GSK వేలు నేతృత్వంలో ఈ సంస్థ నడుస్తోంది.

 కంపెనీ వ్యాపారం.

కంపెనీ వ్యాపారం.

.

న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ 150 కంటే ఎక్కువ ప్రయోగశాలలు, 2,000 కంటే ఎక్కువ సేకరణ కేంద్రాలను కలిగి ఉన్న భారతదేశంలోని అగ్రశ్రేణి పాథాలజీ లేబొరేటరీ చైన్. ప్రస్తుతం కంపెనీ ఇండియాతో పాటు దక్షిణాఫ్రికా, US, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ప్రస్తుతం కంపెనీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని చూస్తోంది. గత కొంత కాలంగా ఐపీవోగా మార్కెట్లోకి రావాలని కంపెనీ యోచిస్తోంది.

ఇష్యూ వివరాలు..

ఇష్యూ వివరాలు..

మార్కెట్లు ఇప్పుడు స్థిరపడినందున కంపెనీ ఐపీవోను ఫ్లోట్ చేసేందుకు సిద్ధమైంది. ఇదే వ్యాపారంలో ఉన్న డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్ లిమిటెడ్, థైరోకేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ వంటి డయాగ్నొస్టిక్ స్టాక్‌ల షేర్ ధరలు గత సంవత్సరంలో ఒత్తిడిలో ఉన్నాయి. ఈ రంగంలోని ఆన్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్లు హెల్తీయన్స్, టాటా 1ఎంజీతో పాటు ఇతరుల నుంచి పోటీ ఉండటం దీనికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీలకు నాన్-కొవిడ్ ఆదాయం బాగా పెరుగుతోంది.

 ప్రతికూల అంశాలు..

ప్రతికూల అంశాలు..

ఈ రంగంలో తక్కువ ధరలకే సేవలను అందిస్తున్న కంపెనీలు చాలా కాలంగా మార్కెట్లో నిలిచాయి. అయితే ప్రస్తుతం న్యూ ఏజ్ కంపెనీలు పరీక్షల ధరలను పెంచటం పరిశ్రమలో ధరల ఒత్తిడికి ఉపశమనంగా నిలుస్తుంది. తక్కువ-ధర సర్వీస్ ప్రొవైడర్ల నుంచి పోటీ అనేది నిర్మాణాత్మక ముప్పు కాదని BNP పరిబాస్‌లోని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లిస్టెడ్ డయాగ్నస్టిక్ కంపెనీలు అసంఘటిత రంగాల నుంచి సంఘటిత రంగానికి మారడం వల్ల కూడా ప్రయోజనం పొందుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.

కంపెనీ కొనుగోళ్లు..

కంపెనీ కొనుగోళ్లు..

న్యూబెర్గ్ బెంగళూరుకు చెందిన ఆనంద్ డయాగ్నోస్టిక్స్, అహ్మదాబాద్‌కు చెందిన సుప్రటెక్ మైక్రోపాత్, పూణేకి చెందిన AG డయాగ్నోస్టిక్స్, చెన్నైకి చెందిన ఎర్లిచ్ ల్యాబ్ తో సహా మరికొన్నింటిని కొనుగోలు చేసింది. ఇవి కంపెనీ విస్తరణకు ఎంతగానో దోహదపడుతున్నాయి. అయితే కంపెనీ ప్రస్తుతం దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలతో పాటు విదేశీ మార్కెట్లోకి విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది.

English summary

Neuberg Diagnostics IPO: మార్కెట్లోకి న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ ఐపీవో.. ఇన్వెస్ట్ చేయాలా..? | Know details about Neuberg Diagnostics IPO that planning to raise 1500 crores from market

Know details about Neuberg Diagnostics IPO that planning to raise 1500 crores from market
Story first published: Sunday, December 4, 2022, 11:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X