SEBI News: భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీకి తొలి మహిళా ఛైర్మన్ మాధవి పూరీ బుచ్. అయితే నిన్నటి నుంచి ఆమె పాత్రకు సంబంధించి అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ భారీ ఆరోపణలతో కొత్త నివేదికను ప్రచురించింది. దీంతో మార్కెట్లో అందరి దృష్టి ఆమెపై పడింది.
వాస్తవానికి హిండెన్ బర్గ్ నిన్న విడుదల చేసిన నివేదికలో సెబీ చీఫ్ మాధవి బుచ్‌పై దాడి చేసింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు కలిగిన ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో సెబీ చైర్‌పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నట్లు కొన్ని రహస్య నివేదికలను ఉటంకించింది. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని, షేర్ ధరలో కుంభకోణం జరిగిందంటూ సంచలన నివేదిక విడుదల చేసి దాదాపు 18 నెలలు గడిచినప్పటికీ షార్ట్ సెల్లర్ ఇప్పటికీ దానికి సంబంధించిన అనేక వివరాలను విడుదల చేస్తూనే ఉంది.

మారిషస్‌లోని అదానీ గ్రూప్ నెట్‌వర్క్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అందించినప్పటికీ సెబీ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. అలాగే వినోద్ అదానీ నేతృత్వంలోని షెల్ కంపెనీల్లో సెబీ చైర్‌పర్సన్, ఆమె భర్త ధవల్ బుచ్ విదేశాల్లో అదానీకి చెందిన వాటాలు కలిగి ఉన్నారని హిండెన్‌బర్గ్ పేర్కొంది.
మాధబి పూరీ బుచ్ 1966లో జన్మించారు. ఆమె బాల్యం ముంబైలోనే గడిపారు. తండ్రి కమల్ పూరి కార్పొరేట్ రంగంలో పని చేయగా, అతని తల్లి పొలిటికల్ సైన్స్‌లో డాక్టరేట్ పొందారు. 18 ఏళ్ల వయస్సులోనే ఆమెకు ధవల్ బుచ్‌తో వివాహం నిశ్చయించబడింది. ఆమె భర్త ధవల్ బహుళజాతి కంపెనీ యూనిలీవర్‌లో డైరెక్టర్. అయితే 21 ఏళ్లు వచ్చేసరికీ వివాహం పూర్తైంది. పెళ్లి తర్వాత మాధవి కెరీర్‌ను సీరియస్‌గా తీసుకుని ముందుకు సాగారు. మాధవి పూరి బుచ్ ఐఐఎం అహ్మదాబాద్ నుండి MBA డిగ్రీని, దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి గణితంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

మార్చి 2022లో సెబీకి తొలి మహిళా చైర్‌పర్సన్‌గా మాధబి పూరి బుచ్ నియమితులై చరిత్ర సృష్టించారు. కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమెను మూడేళ్ల కాలానికి అంటే 2025 వరకు సెబీ చీఫ్‌గా నియమించారు. దీనికి ముందు ఆమె సెబీ బోర్డులో పూర్తికాల సభ్యురాలుగా కూడా పనిచేశారు.
వీటికి ముందు బుచ్ షాంఘైలోని న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు సలహాదారుగా, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ సింగపూర్ కార్యాలయానికి అధిపతిగా పనిచేశారు. దీనితో పాటు ఆమె ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఎండీ, సీఈవో, ICICI బ్యాంక్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఇదే క్రమంలో ఆమె అనేక కంపెనీ బోర్డుల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications