Elon Musk-Apple: ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి తన ప్లాన్లను ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి కారణం చెప్పకుండానే యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్ ను బ్లాక్ చేస్తామని ఆపిల్ బెదిరించినట్లు ఎలాన్ మస్క్ ఆరోపించారు. అయితే ఆపిల్ వల్ల సర్వీసుల లాంచ్ మరింత లేటు కావొచ్చని తెలుస్తోంది.

ఆపిల్ ప్రకటనలు..
ఐఫోన్ తయారీదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ప్రకటనలను నిలిపివేసినట్లు మస్క్ అన్నారు. ట్విట్టర్ ఆదాయంలో దాదాపు 90 శాతం అడ్వర్టైజింగ్ ఖాతాల ద్వారా సంపాదిస్తోంది. ఆపిల్ సోషల్ నెట్‌వర్క్‌లో వరుసగా చాలా సంవత్సరాలు అగ్ర ప్రకటనల ఇచ్చే కంపెనీల్లో ఒకటి. ఆపిల్ సోషల్ మీడియా ప్రకటనల కోసం దాదాపు 100 మిలియన్ డాలర్లను వెచ్చించేది.

ట్విట్టర్‌కు దూరంగా..
ఎలాన్ మస్క్ ఎంట్రీ తర్వాత టాప్-100 అడ్వర్టైజింగ్ కంపెనీల్లో సగం కంపెనీలు ట్విట్టర్‌లో ప్రకటనలకు దూరమయ్యాయి. ఇప్పుడు మరికొన్ని కంపెనీలు తమ ప్రకటనలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఆపిల్ పై ఆగ్రహం..
యాప్ స్టోర్ ద్వారా లావాదేవీలు జరిపై వ్యక్తుల నుంచి కంపెనీ 30 శాతానికి పైగా ఫీజులను వసూలు చేస్తోందని ఎలాన్ మస్క్ అన్నారు. మొబైల్ డివైజ్‌లలో బిలియన్ల కంటే ఎక్కువ అప్లికేషన్‌లను ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా మాత్రమే అనుమతిస్తుందని మస్క్ ఫిర్యాదు చేశారు. 'ఫోర్ట్‌నైట్' తయారీదారులైన ఎపిక్ గేమ్స్ వంటి కంపెనీలు ఆపిల్ ప్లే స్టోర్‌లో వసూలు చేస్తున్న రుసుములను విమర్శించాయి. కొన్ని కంపెనీలు యాపిల్‌పై చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నాయి.

ట్విట్టర్‌పై ఆపిల్ ఒత్తిడి..
కంటెంట్ నియంత్రణ కోసం ఆపిల్ తన డిమాండ్ల విషయంలో ట్విట్టర్‌పై ఒత్తిడి తెస్తోందని బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆరోపించారు. దీనిపై చిర్రెత్తిన ఎలాన్ మస్క్ తనకు కోపం వస్తే ఆపిల్, గూగుల్ కు పోటీగా మెుబైల్ తయారు చేస్తానని అన్నారు. ఈ క్రమంలో కొత్త టెస్లా ఫోన్ విడుదల చేసి గట్టిపోటీ ఇవ్వవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications