Mutual Funds: కొత్త మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ స్కీమ్ మీ కోసమే..!
Franklin Templeton NFO: దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతోంది. తక్కువ రిస్కుతో బ్యాంకు డిపాజిట్లు లేదా పొదుపు పథకాల నుంచి వచ్చే రాబడి కంటే ఎక్కువ స్టాక్ మార్కెట్ల నుంచి లభిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. పైగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించటానికి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఇచ్చే రాబడి సరిపోదని వారు అంటున్నారు. అందుకే నేరుగా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి బదులుగా మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ అని చాలా మంది ప్రస్తుతం భావిస్తున్నారు. పైగా ఫైనాన్షియల్ లిటరసీ పెరుగుతున్న వేళ మ్యూచువల్ ఫండ్ల పనితీరు, రాబడిపై కూడా అవగాహన పెరుగుతోంది.
దీంతో మ్యూచువల్ ఫండ్లలోకి ప్రతినెల రికార్డు స్థాయిలో పెట్టుబడులు ప్రవాహం రికార్డు స్థాయిలకు చేరుకుంటోంది. దీనికి అనుగుణంగా మార్కెట్లోని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కొత్త ఫండ్లను పరిచయం చేస్తున్నాయి. కొత్తగా పెట్టుబడులు ప్రారంభించాలనుకునే చాలా మంది వీటి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియా కొత్తగా లాంగ్ టర్మ్ ఫండ్‌ను ప్రారంభించింది. ఈ ఫండ్ డిసెంబర్ 4 వరకు పెట్టుబడిదారుల సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఫండ్ వివరాలను పరిశీలిస్తే.. ఇదొక ఓపెన్-ఎండ్ స్కీమ్. ఇది డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయాన్ని సృష్టించటం దీని ప్రధాన లక్ష్యం. దీర్ఘకాలంలో మంచి రాబడులను అందుకోవాలని భావించే ఇన్వెస్టర్లకు ఈ స్కీమ్ అనుకూలమైన ఎంపిగా నిలవనుంది.

ఈ ఫండ్‌లో పెట్టుబడి ప్రారంభించాలనుకునే వ్యక్తులు కనీస పెట్టుబడిగా రూ.5000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. స్కీమ్ రుణ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ సాధనాలు, నగదు, నగదు సమానమైన వాటిపై 0-100% నిధులను కేటాయిస్తుంది. పైగా ఇందులో ఎలాంటి ఎగ్జిట్ లోడ్ లేకపోవటం గమనార్హం. నియంత్రణ 52(6)(c) ప్రకారం అనుమతించబడిన గరిష్ట ఎక్స్‌పెన్స్ రేషియో రోజువారీ నికర ఆస్తులలో 2.00% మించకూడదు. ఈ స్కీమ్ వృద్ధితో పాటు ఆదాయ పంపిణీ అండ్ క్యాపిటల్ రిటర్న్ ఎంపికలతో అందుబాటులోకి వస్తోంది. ఈ స్కీమును చాందినీ గుప్తా, అనుజ్ థాగ్రా నిర్వహించనున్నారు.
దీర్ఘకాలిక రాబడితో పాటు మూలధన వృద్ధిని సాధించాలని భావించే పెట్టుబడిదారులకు ఈ స్కీమ్ అనుకూలమైనదిగా తెలుస్తోంది. ఇది ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ పోర్ట్‌ఫోలియో మెకాలే వ్యవధితో ప్రధానంగా డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం రూపొందించబడింది. పైగా మితమైన రిస్క్ ఇందులో ఉన్నందున ఈ కేటగిరీ రిస్క్ తీసుకునే పెట్టుబడిదారులను స్కీమ్ ప్రధానంగా గార్గెట్ చేయనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications