IPO News: ప్రస్తుతం మార్కెట్లలో ఐపీవోల హడావిడి కొనసాగుతోంది. ఈ బూమ్‌ను చాలా మంది ఇన్వెస్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రేపు మెుత్తం రెండు కంపెనీలు తమ ఐపీవోల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరచుకోనున్నాయి.
వివరాల్లోకి వెళితే రేపు Newjaisa Technologies ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరచుకుంటోంది. సాంకేతికత ఆధారంగా D2C కేటగిరీలో అనేక బ్రాండ్ల నాణ్యమైన బెస్పోక్ రీఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్స్‌ను కంపెనీ విక్రయిస్తోంది. కొత్త ఉత్పత్తులతో పోలిస్తే గణనీయమైన తగ్గింపు ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు విక్రయించటంలో కంపెనీ మంచి గుర్తింపును తెచ్చుకుంది. భారతీయ మార్కెట్ కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బడ్జెట్‌కు అనుకూలమైన, పర్యావరణ అనుకూలమైన ఐటి ఉత్పత్తులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విశేష్ హండా తెలిపారు.

ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండనుంది. దీనికోసం ప్రైస్ బ్యాండ్ రూ.44-47గా కంపెనీ నిర్ణయించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మెుత్తం 39.93 కోట్ల రూపాయలను మార్కెట్ల నుంచి సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ 84,96,000 తాజా షేర్లను ఇన్వెస్టర్లకు విక్రయిస్తోంది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లు రూ.5 ప్రీమియం ధరను కలిగి ఉన్నాయి.
ఐపీవో కోసం కంపెనీ ఒక్కో లాటులో 3000 షేర్లను విక్రయిస్తోంది. ఈ లెక్కన అప్పర్ ప్రైస్ బ్యాండ్ ధరను పరిగణలోకి తీసుకుంటే ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనటానికి కనీసం రూ.1.41 లక్షలను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలో అక్టోబర్ 9, 2023న లిస్ట్ అయ్యే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ మెుత్తం ప్రక్రియకు Bigshare Services Pvt Ltd అధికారిక రిజిస్ట్రార్‌గా నియమించబడింది.


Click it and Unblock the Notifications