Gold Leasing: పసిడి అంటే భారతీయులకు ప్రాణం. ఏ చిన్న శుభకార్యం జరిగినా అందులో ఒక్క గ్రామైనా బంగారం కొంటుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో డిజిటల్ గోల్డ్, గోల్డ్ లీజింగ్ అంటూ కొత్త పోకడలు ప్రారంభమయ్యాయి. వీటి గురించి పూర్తి పరిజ్ఞానం లేకుంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో గోల్డ్ లీజింగ్ అనే కొత్త కాన్సెప్ట్ వినిపిస్తోంది. ఇదొక ఆధునిక పెట్టుబడి అవకాశంగా పరిగణించబడుతోంది. దీని ద్వారా మీ బంగారం పెట్టుబడులు ఆదాయాన్ని సమకూరుస్తాయి. తద్వారా ధర పెరుగుదల ప్రయోజనంతో పాటు 4-5 శాతం అదనపు ఆదాయాన్ని పొందగలుగుతారు. గతంలో ఈ అవకాశం సంపన్నులు, కొందరు బంగారు వ్యాపారులకు మధ్య నమ్మకంగా జరుగుతూ ఉండేది. అయితే ఇది గ్రాముల్లో కాకుండా కేజీల్లో వారి మధ్య లావాదేవీలను కలిగి ఉండేది. టెక్నాలజీ మార్పు కారణంగా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.

గోల్డ్ లీజింగ్ ప్రక్రియలో డిజిటల్ గోల్డ్ లేదా ఫిజికల్ గోల్డ్ పెద్ద నగల వ్యాపారులకు రోజువారీ వడ్డీకి అందింస్తారు. వారు దీనికి వడ్డీని డబ్బు రూపంలో లేదా బంగారం రూపంలో తిరిగి చెల్లించటం జరుగుతుంది. మార్కెట్లో బంగారం రేటు పెరిగితే వడ్డీ ఆదాయం పెరుగుతుంటుంది. ఈ క్రమంలో ఆభరణాల వ్యాపారులు వారు తీసుకునే బంగారం లీజుకు 100% బ్యాంక్ గ్యారెంటీని అందించటం పెట్టుబడిదారులకు భద్రతను అందిస్తోంది.
లీజ్ విషయంలో కొన్ని టెక్ ప్లాట్‌ఫారమ్‌లు గడువు పెడుతుంటే.. మరికొన్ని మాత్రం పెట్టుబడిదారులు కావాల్సినప్పుడు వెనక్కి తీసుకునే వెసులుబాటును అందిస్తున్నాయి. ఉపసంహరణ తేదీ వరకు వచ్చిన వడ్డీని ప్రిన్సిపల్‌తో పాటు కస్టమర్ ఖాతాలో జమ చేస్తారు. ఇదే క్రమంలో సావరిన్ గోల్డ్ బాండ్స్ విషయానికి వస్తే అవి 8 సంవత్సరాల లాక్ ఇన్ పిరియడ్‌తో పూర్తిగా ప్రభుత్వం తరఫున రిజర్వు బ్యాంక్ హామీతో వస్తున్నాయి. కానీ గోల్డ్ లీజింగ్ విషయంలో ఎలాంటి ప్రభుత్వ హామీలు లేవు. అయితే రాబడి కొంత ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో పాన్ కార్డు కేవైసీ ద్వారా బంగారాన్ని లీజ్ కు తీసుకునే అనేక కంపెనీలు తమ యాప్స్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇవి కస్టమర్ల నుంచి చిన్న మెుత్తాలను సమీకరించి కేజీల్లో ఆభరణాల తయారీదారులకు అందిస్తుంటాయి. ప్రస్తుతం బంగారం ధరలు అధికంగానే కొనసాగుతున్న తరుణంలో గోల్డ్ అప్రీసియేషన్ కంటే మ్యూచువల్ ఫండ్స్ రాబడులు అధికంగా ఉన్నాయి. సెబీ వంటి రెగ్యులేటరీ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు, హామీ లేకుండా గోల్డ్ లీజింగ్ వ్యాపారం జరుగుతున్నందున రిస్క్ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. అందువల్ల అధిక రాబడులకు ఆశపడి ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టుకుండా ఉండటం శ్రేయస్కరం.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications