Global Surfaces IPO: రేపే మార్కెట్లోకి వస్తున్న ఐపీవో.. సూపర్ గ్రే మార్కెట్ ప్రీమియం..!

Global Surfaces IPO: చాలా కాలం విరామం తర్వాత మళ్లీ మార్కెట్లోకి ఐపీవోలు రావటం ఇటీవలే ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు సానుకూలంగా లేనందున చాలా కంపెనీలు తమ ఐపీవోలను తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు మార్కెట్లో గ్లోబల్ సర్ఫేసెస్ ఐపీవో ప్రారంభం కాబోతోంది.

ఐపీవో విశేషాలు..

ఐపీవో విశేషాలు..

ఈ ఐపీవో మార్చి 13 నుంచి మార్చి 15 వరకు ఇన్వెస్టర్ల సబ్ స్క్రిప్షన్ కోసం తెరచి ఉండనుంది. అయితే ఈ స్టాక్ మార్చి 23న మార్కెట్లో లిస్ట్ కానున్నట్లు తెలుస్తోంది. రూ.10 ఫేస్ వ్యాల్యూ కలిగిన స్టాక్ ప్రైస్ బ్యాండ్ రూ.133 నుంచి రూ.140గా కంపెనీ నిర్ణయించింది. ఒక్కో లాటులో 100 షేర్లను ఆర్డర్ పరిమితిగా నిర్ణయించారు. ఈ ఐపీవో ద్వారా మెుత్తం రూ.154.98 కోట్లను కంపెనీ సమీకరిస్తోంది. ఈ స్టాక్స్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచీల్లో లిస్ట్ కానున్నాయి.

ముఖ్యమైన విషయాలు..

ముఖ్యమైన విషయాలు..

మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ సర్ఫేసెస్ లిమిటెడ్ మొత్తం ఆదాయం రూ.198 కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలో పన్నుల చెల్లింపు తర్వాత లాభం రూ.35 కోట్లుగా నమోదైంది. సెప్టెంబర్ 30, 2022తో ముగిసిన ఆరు నెలల కాలానికి రూ.99 కోట్ల నికర రాబడిని, రూ.13.6 కోట్ల పన్ను అనంతర లాభాన్ని కంపెనీ ఆర్జించింది. ప్రస్తుతం మార్కెట్లో ఐపీవో గ్రే మార్కెట్ ప్రీమియం రూ.45గా ఉంది. అయిటే ఇష్యూ అప్పర్ బ్యాండ్ ధర రూ.140ని పరిగణలోకి తీసుకుంటే స్టాక్ రూ.185 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

గ్లోబల్ సర్ఫేసెస్ లిమిటెడ్ 1991లో స్థాపించబడింది. కంపెనీ సహజ రాళ్ల ప్రాసెసింగ్, ఇంజినీరింగ్ క్వార్ట్జ్ తయారీలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ ఫ్లోరింగ్, వాల్ క్లాడింగ్, కౌంటర్‌టాప్‌లు, కట్-టు-సైజ్ ఉత్పత్తులను అందిస్తోంది. దేశంలోనే కాక విదేశాల్లో కూడా వాణిజ్య, నివాస భవనాలకు వచ్చినప్పుడు కంపెనీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. ప్రస్తుతం కంపెనీ రెండు ఉత్పత్తి యూనిట్లను కలగి ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+